Wednesday, May 15, 2024
- Advertisement -

అభివృద్ధి కోసం కోడి పందేలు ?

- Advertisement -

గ్రామాలు అభివృద్ధి చెందాలంటే ఏం చేయాలి.. అంతా కలిసికట్టుగా పనిచేయాలి! లేదంటే ఉన్న వనరులను సక్రమంగా వినియోగించుకోవాలి.. కానీ పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన అధికార పార్టీ ఎంపీ మాత్రం అలా కానే కాదంటున్నారు. తమ గ్రామం అభివృద్ధి చెందాలంటే కోడిపందేలు నిర్వహించాలని ఢంకా బజాయించి మరీ చెప్పేస్తున్నారు.

సంక్రాంతి సందర్భంగా గోదావరి జిల్లాల్లో కోడి పందేలు సహజమే. కానీ ఎంపీ మాగంటి బాబు చెప్పే విషయం వింటే అందరికీ ఆశ్చర్యం కలగకమానదు. కోడిపందేలు సంప్రదాయ క్రీడ అంటున్న ఈ ఎంపీగారు.. అవసరమైతే పందేలు అధికారికంగా నిర్వహించుకునేందుకు జీవో కూడా తీసుకొస్తానంటున్నారు.

వినడానికి విడ్డూరంగా ఉన్న ఎంపీ గారు మాట్లాడితే అక్షర సత్యం!! సంప్రదాయంగా వస్తున్న కోడి పందేలను నిలుపుదల చేయడం కోసం కొందరు కోర్టుకు వెళ్తున్నారన్న మాగంటి బాబు.. న్యాయస్థానాలపై తమకు గౌరవముందన్నారు. ఏళ్లుగా నడుస్తున్న కోడిపందేలను నిలుపుచేయడం సరికాదని చెబుతున్నారు.

ఇక కోడి పందేల వల్ల గ్రామాలు ఎలా అభివృద్ధి చెందుతాయో కూడా చెప్పారు మాగంటి బాబు. గ్రామాల్లో పెద్ద ఎత్తున నిర్వహించే కోడి పందేలను చూసేందుకు వచ్చే ఎన్నారైలు ఊళ్ల అభివృద్ధి కోసం ధారళంగా విరాళాలు అందిస్తున్నారట. కోడిపందెలు చూసేందుకు పశ్చిమగోదావరి జిల్లాలో 12 వేల మంది ఎన్‌ఆర్‌ఐలు ముందుకొస్తున్నారని గుర్తుచేశారు.

వేల కోట్ల వ్యయంతో గుర్రపు పందేలు నిర్వహించటానికి అనుమతి ఇస్తున్నప్పుడు కోడి పందేలకు అభ్యంతరం దేనికని ప్రశ్నించారు ఎంపీ గారు.మొత్తానికి మాగంటి చెబుతున్న లాజిక్ బాగేనే ఉంది కానీ.. కోడి పందెల మోజులో చాలామంది సంసారాలు సర్వనాశనం చేసుకుంటున్నారన్నది వాస్తవం.

మరి గ్రామాల అభివృద్ధి గురించి మాట్లాడుతున్న ఎంపీగారు పందెం మోజులో పడి కుటుంబాలు నాశనం చేసుకునే వారి గురించి కూడా మాట్లాడితే బాగుంటుంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -