Friday, May 17, 2024
- Advertisement -

‘ఢీ 10’ ఫైనల్స్‌కు ఎన్టీఆర్ ఎంత తీసుకున్నాడో తెలుసా?

- Advertisement -

ఎన్టీఆర్ మంచి జోష్‌లో ఉన్నాడు.అత‌ని సినిమాలు వ‌ర‌సగా అన్ని హిట్లుగా నిలుస్తున్నాయి.టెంప‌ర్‌,నాన్న‌కు ప్రేమ‌తో.జ‌న‌త గ్యారేజ్,జై ల‌వ‌కుశ సినిమాల‌తో హిట్లు కొట్టాడు తార‌క్‌.ఇక ఎన్టీఆర్ ప్ర‌స్తుతం మాటల మాంత్రికుడు త్రివిక్ర‌మ్ ద‌ర్శ‌కత్వంలో అర‌వింద స‌మేత అనే సినిమా చేస్తున్నాడు.సినిమాలు కాకుండా ఎన్టీఆర్ ఓ మొబైల్ సంస్థకు ప్రచారకర్తగా కూడా వ్య‌వ‌హ‌రిస్తున్నాడు.ఇక టెలివిజ‌న్‌లో ప్ర‌సార‌మ‌య్యే ‘ఢీ 10’ డ్యాన్స్ షో ఫైన‌ల్స్‌కి ముఖ్య అతిధిగా వ‌చ్చారు ఎన్టీఆర్.

ఈ షోలో ఎన్టీఆర్ త‌నదైన శైలీలో అదరగొట్టాడు.‘ఢీ 10’ ఫైనల్స్ కోసం రెండు గంటల సమయం కేటాయించిన ఎన్టీఆర్, దానికి త‌గిన పారితోష‌కం తీసుకున్నాడ‌ని స‌మాచారం.రెండు గంటల సమయ‌నికి ఎన్టీఆర్ రూ.25 లక్షల రెమ్యూనరేషన్ తీసుకున్నట్లు సమాచారం. ఎన్టీఆర్ పాల్గొన్న ఎపిసోడ్ కు 13.9 టీఆర్పీ రేటింగ్ రావడం విశేషం. ‘ఢీ’ చరిత్రలోనే ఇది హైయెస్ట్ టీఆర్పీ రేటింగ్. దీని బ‌ట్టి అర్థం చేసుకోవ‌య‌చ్చు ఎన్టీఆర్ రేంజ్ ఏమిటో.

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -