Monday, May 13, 2024
- Advertisement -

ఆసక్తిని రేపుతున్న ఎన్టీఆర్ సినిమా కథ…!

- Advertisement -

ఇంతకు ముందు మహేశ్ బాబు “వన్” సినిమా విషయంలో కూడా దర్శకుడు సుకుమార్ కథను చాలా రహస్యంగా ఉంచాడు. ఆ సినిమా కాన్సెప్ట్ ఏమిటి? సినిమా ఎలా ఉంటుంది? కథ దేని చుట్టూ తిరుగుతుంది? అనే అంశాలు ఎవరి ఊహకూ అందలేదు. తీరా సినిమా వచ్చి ప్రేక్షకులకు సర్ ప్రైజ్ ను ఇచ్చింది.

తెలుగు తెరపై ఎన్నడూ రానటువంటి కథగా నిలిచింది. అయితే సూపర్ హిట్ కాలేదు కానీ.. ప్రత్యేకమైన సినిమాగా మాత్రం నిలిచింది.

మరి ఇలాంటి నేపథ్యంలో రెండు సంవత్సరాల తర్వాత సుకుమార్ ఎన్టీఆర్ తో సినిమాతో బిజీ అయిపోయాడు. ఈ సినిమా షూటింగ్ కూడా ఇప్పుడు లండన్ లో జరుగుతోంది. మరి ఈ సినిమ కథ ఏంటి? ఏ కాన్సెప్ట్ గురించి సినిమాను రూపొందిస్తున్నారు? అనేది పరమ రహస్యంగానే ఉంది. ఈ సినిమా పేరు “నాన్నకు ప్రేమతో..” ని కూడా ప్రచారం జరుగుతోంది కానీ.. అదే కన్ఫర్మ్ అవుతుందని మాత్రం అనుకోవడానికి లేదు.

మహేశ్ – సుకుమార్ ల కాంబోలో వచ్చిన సినిమా విషయంలో కూడా అనేక టైటిల్స్ ప్రచారంలోకి వచ్చాయి చివరకు ‘వన్’ అనే టైటిల్ కన్ఫర్మ్ అయ్యింది. ఇదే విధంగా ఎన్టీఆర్ తో సకుమార్ తీస్తున్న సినిమా టైటిల్ కూడా ఎప్పుడైన మారిపోయే అవకాశం ఉంది.

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -