Tuesday, May 14, 2024
- Advertisement -

ప్రీ రిలీజ్ బిజినెస్ లో బాహుబలి రికార్డు..!

- Advertisement -

ప్రీ రిలీజ్ బిజినెస్ విషయంలో బాహుబలి రికార్డులను సృష్టిస్తోంది. రాజమౌళి దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా రూపొందిన ఈ సినిమా విడుదలకు ముందే వంద కోట్ల రూపాయల మార్కును దాటింది.

తద్వారా సరికొత్త రికార్డును సృష్టించిన తెలుగు సినిమాగా నిలిచింది. ఈ సినిమా థియేటరికల్ రైట్సే ఏకంగా 83 కోట్ల రూపాయల మార్కను తాకిందని సమాచారం.

నైజాం 22.5 కోట్ల రూపాయలు, సీడెడ్ 12.6 కోట్లు, ఉత్తరాంధ్ర 7.2 కోట్ల రూపాయలు, గుంటూరు + నెల్లూరు తొమ్మిది కోట్ల రూపాయలు, ఉభయ గోదావరి జిల్లాలు పది కోట్ల రూపాయలు, కృష్ణా 4.5 కోట్ల రూపాయలు.. కర్ణాటక 8.6 కోట్ల రూపాయలు, ఓవర్సీస్ 9 కోట్ల రూపాయల మార్కెట్ ను సాధించింది బాహుబలి. ఈ విధంగా 83 కోట్ల రూపాయల రేంజ్ కు చేరింది.

ఇక ఈ సినిమా థియేటర్లో ప్రదర్శన బిజినెస్ నే ఈ స్థాయిలో ఉండగా.. టీవీ రైట్స్, డబ్బింగ్ రైట్స్ తో ఈ సినిమా 125 కోట్ల రూపాయల మార్కును రీచ్ అయ్యిందని సమాచారం.ఈ  విధంగా బాహుబలి మేకింగ్ లోనే గాక.. వ్యాపారంలో కూడా రికార్డు సృష్టించింది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -