Sunday, April 28, 2024
- Advertisement -

చరణ్ కూతురికి ఎన్.టి.ఆర్ ఇచ్చిన గిఫ్ట్ ఏంటో తెలుసా.. రామరాజుకి భీమ్ ఇచ్చిన సూపర్ సర్ ప్రైజ్..!

- Advertisement -

మెగా పవర్ స్టార్ రాం చరణ్ ఉపాసన దంపతులకు ఎమధ్యనే ఒక పాప జన్మించిన విషయం తెలిసిందే. మెగా ఫ్యామిలీ ఇంట మహాలక్ష్మి పుట్టిందని పాప పుట్టిన విషయాన్ని చెబుతూ మెగా ఫ్యామిలీ అంతా సంబరపడ్డారు. ఇక చరణ్, ఉపాసన ఈ పాపకి క్లిం కారా అనే పేరు పెట్టారు.

ఈ పేరు అనౌన్స్ చేసినప్పుడే ఆ పేరుకి అర్ధం ఏంటని అందరు వెతకడం మొదలు పెట్టారు. అమ్మవారి పేర్లలో అది ఒకటని తెలుసుకున్నారు. ఇక ఇదిలాఉంటే చరణ్ కూతురికి కొమరం భీం అదేనండి మన ఎన్.టి.ఆర్ ఒక సర్ ప్రైజ్ గిఫ్ట్ ఇచ్చాడని తెలుస్తుంది. ఆర్.ఆర్.ఆర్ సినిమా టైం లో చరణ్, తారక్ ఇద్దరి మధ్య బలమైన బంధం ఏర్పడింది.

ఇద్దరు గ్లోబల్ స్టార్స్ గా ఎదిగిన తీరు అద్భుతమని చెప్పొచ్చు. ఈ క్రమంలో చరణ్ పాపకి ఎన్.టి.ఆర్ ఒక గోల్డ్ డాలర్ ని గిఫ్ట్ గా ఇచాడట. అయితే గోల్డ్ డాలర్ లో ప్రత్యేకత ఏముంది అనుకోవచ్చు.. అక్కడే ఉంది అసలు ట్విస్ట్.. గోల్డ్ డాలర్ మీద క్లిం కారాతో పాటుగా చరణ్ ఉపాసనల పేర్లు కూడా ఉన్నాయట. తారక్ ఇచ్చిన గిఫ్ట్ చూసి చరణ్ సర్ ప్రైజ్ అయ్యాడని తెలుస్తుంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -