Sunday, April 28, 2024
- Advertisement -

కమెడియన్లనే కానీ స్టార్ హీరోలకు ఏమాత్రం తీసిపోని రెమ్యునరేషన్లు.. బ్రహ్మి to ప్రియదర్శి బాబోయ్ అనిపిస్తున్నారు..!

- Advertisement -

ఒక సినిమా సక్సెస్ లో స్టార్ హీరోలు ఎంత ఇంపార్టెంటో ఆ సినిమాలో నటించిన వారంతా కూడా అంతే ప్రాధాన్యత కలిగి ఉంటారు. హీరోలకు ఎక్కువ మార్కులు వేసినా అందులో నటించిన హీరోయిన్స్, కమెడియన్స్ అంతా కూడా ఇంప్యాక్ట్ కలిగిస్తారు. ఒక్కోసారి సినిమా హిట్ లో కమెడియన్స్ కూడా ముఖ్య పాత్రని పోషిస్తున్నారు. టాలీవుడ్ కమెడియన్స్ లో ఎవరెవరికి ఎంత రెమ్యునరేషన్ తీసుకుంటున్నారు ఆ లెక్క ఏంటో ఇప్పుడు చూద్దాం.

కామెడీ కింగ్.. హాస్య బ్రహ్మ నవ్వుల రాజు బ్రహ్మానందం సూపర్ హిట్ సినిమాలన్నిటిలో నటించారు. తన కామెడీతో కడుపుబ్బా నవ్వించే బ్రహ్మి ఎలాంటి పాత్ర చేసినా నవ్వులు పండాల్సిందే. అయితే బ్రహ్మి మంచి ఫాం లో ఉప్పుడే కూడా రెమ్యునరేషన్ ఓ రేంజ్ లో తీసుకున్నాడట. రోజుకి 2 లక్షల దాకా రెమ్యునరేషన్ తీసుకున్నాడని తెల్స్తుంది. ఆ తర్వాత అలి కూడా స్టార్ కమెడియన్ గా అలరిస్తూ వచ్చారు. ఆయన కూడా రోజుకి మూడున్నర లక్షల దాకా డిమాండ్ చేస్తున్నారని తెలుస్తుంది.

వెన్నెల కిషోర్ కూడా 2 నుంచి 3 లక్షల దాకా రెమ్యునరేషన్ తీసుకుంటున్నారట. ఒకప్పుడు స్టార్ కమెడియన్ సునీల్ ఇప్పుడు విలన్ గా చేస్తున్నారు. ఆయన కూడా రోజుకి 4 లక్షల దాకా రెమ్యునరేషన్ అందుకుంటున్నారని తెలుస్తుంది. ఇక రీసెంట్ స్టార్ కమెడియన్ యాక్టర్ ప్రియదర్శి కూడా రోజుకి 2 లక్షల దాకా రెమ్యునరేషన్ తీసుకుంటున్నట్టు టాక్. ఒకప్పుడు రైటర్ ఆ తర్వాత విలన్, కమెడియన్ గా మారిన పోసాని కూడా రోజుకి 2 లక్షల దాకా తీసుకున్నారట.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -