ఫ్యాక్ష‌న్ జోన‌ర్‌లో ఎన్టీఆర్‌-త్రివిక్ర‌మ్ సినిమా!

ఎన్టీఆర్ వ‌రుస హిట్ల‌తో మంచి జోష్‌లో ఉన్నాడు. జై ల‌వ‌కుశ త‌రువాత కొంత గ్యాప్ తీసుకున్న తార‌రక్ త్రివిక్ర‌మ్ సినిమాకు రెడీ అయ్యాడు.ఇప్ప‌టికే ఈ సినిమా షూటింగ్ ప్రారంభ‌మైంది.తాజాగా ఈ సినిమాకు సంబంధించి ఓ ఆసక్తికరమైన వార్త ఒక‌టి సోష‌ల్ మీడియాలో చ‌క్క‌ర్లు కొడుతుంది.త్రివిక్ర‌మ్ డైర‌క్ష‌న్‌లో ఎన్టీఆర్ చేస్తున్న ఈ సినిమా ఫ్యాక్ష‌న్ జోన‌ర్‌లో ఉండ‌బోతుంద‌ని టాలీవుడ్‌లో వినిపిస్తున్న మాట‌. ఈ సినిమాకు సంగీతం థ‌మ‌న్ అందిస్తున్న సంగ‌తి తెలిసిందే.ఈ వార్తే నిజం అయితే తెలుగులో ఫ్యాక్ష‌న్ సినిమాలు వచ్చి చాలాకాలం అయింది.

సీనియర్‌ నటులు నాగబాబు, జగపతి బాబు ప్రత్యర్థులైన ఫ్యాక్షన్‌ లీడర్‌లుగా కనిపిస్తారని తెలుస్తోంది. అజ్ఞాతవాసి ఫ్లాప్ త‌రువాత త్రివిక్ర‌మ్ తీస్తున్న సినిమా కావడంతో సినిమాపై స్పెష‌ల్ ఫోక‌స్‌ పెట్టి మ‌రి తీస్తున్నాడ‌ని స‌మాచారం.ఎన్టీఆర్‌ సరసన తొలిసారిగా పూజా హెగ్డే హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ సినిమా కోసం ప్రత్యేకంగా ట్రయిన్‌ అయిన ఎన్టీఆర్‌ కొత్త లుక్‌లో డిఫరెంట్‌ మేకోవర్‌లో దర్శనమిస్తున్నాడు. ఈ సినిమాను ద‌స‌రాకు కాని ఏడాది చివ‌రికి కాని తీసుకురాల‌ని ప్ర‌య‌త్నాలు చేస్తుంది చిత్ర యూనిట్‌.