Sunday, May 5, 2024
- Advertisement -

బిజెపితో పొత్తు….. స్పష్టంగా తేల్చేసిన జగన్…. బాబుకు షాకిచ్చాడు

- Advertisement -

గరుడ పురాణం అంటూ పచ్చ బ్యాచ్ ప్రచారంలోకి తెచ్చిన పెక్కిటి కథలన్నింటికీ కౌంటర్ ఇచ్చాడు జగన్. జగన్ బిజెపితో పొత్తు పెట్టుకోబోతున్నాడు. మోడీతో కుమ్మక్కయ్యాడు అన్న బాబు అబద్ధాలను ఖండిస్తూ పొత్తులపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ వ్యూహం ఏంటో చెప్పేశాడు. 2014 ఎన్నికల సమయంలో కూడా సోనియాతో కుమ్మక్కయ్యాడు, కెసీఆర్‌తో లోపాయికారి ఒప్పందం జగన్‌కి ఉంది. జగనే రాష్ట్ర విభజనకు మద్దతిచ్చాడు అని విష ప్రచారం చేసిన బాబు అండ్ కో ఆ ఎన్నికల్లో బాగానే లాభపడ్డారు. అయితే ఇప్పటి పరిస్థితులను చూస్తే మాత్రం అదే కెసీఆర్‌తో వెల్కం అంటూ పచ్చ బ్యాచ్ ఏ రేంజ్‌లో రాసుకుపూసుకు తిరుగుతోందో చూస్తూనే ఉన్నాం. అలాగే సోనియాతో టిడిపి ఎంపిలు మంతనాలు జరుపుతూ ఎపిలో కాంగ్రెస్‌తో పొత్తు విషయమై చర్చలు జరుపుతున్నారు. అఫ్కోర్స్……… బాబు ఏదైనా సమర్థించుకోగలడు.

ఇక ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రజలు బిజెపిపై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు కాబట్టి బిజెపితో జగన్‌కి ముడిపెట్టే ప్రయత్నాన్ని అనుక్షణం చేస్తున్నాడు చంద్రబాబు. ఇప్పుడు ఆ ప్రచారాన్ని ఖండిస్తూ స్పష్టత ఇచ్చాడు జగన్. పొత్తుల గురించి ఇప్పటి నుంచే ఆలోచించాల్సిన అవసరం లేదని చెప్పాడు. ఆంధ్రప్రదేశ్‌కి ప్రత్యేక హోదాని ప్రకటిస్తూ ఎవరు సంతకం చేస్తే వాళ్ళకే వైకాపా మద్దతు ఉంటుందని చెప్పాడు. అది కూడా హోదా ఇచ్చిన తర్వాతనే పొత్తు పెట్టుకోవడం జరుగుతుందని చెప్పాడు. వైకాపా ఏం చేసినా రాష్ట్ర ప్రయోజనాల కోసమే చేస్తుందని…….ఆ ప్రయోజనాలకు తగ్గట్టుగా నిర్ణయాలు తీసుకున్న తర్వాత ఎవరితోనైనా పొత్తు పెట్టుకోవడం జరుగుతుందని చెప్పాడు. అలా కాకుండా చంద్రబాబులా పొత్తు పెట్టుకుని….నాలుగేళ్ళు వ్యక్తిగతంగా లాభపడి……..ఆ తర్వాత ఎన్నికల ఏడాదిలో మోసపోయాం, మోసం చేశారు అని ప్రజలను వంచించడం తనకు చేతకాదని చెప్పుకొచ్చాడు జగన్. పొత్తుల విషయంపై జగన్ ఇచ్చిన స్పష్టత తర్వాత అయినా బిజెపితో జగన్ కలిసిపోతాడు అన్న అడ్డగోలు ఆరోపణలకు టిడిపి చెక్ చెప్తుందేమో చూడాలి మరి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -