Monday, May 13, 2024
- Advertisement -

బిగ్ బాస్ నుంచి ధనరాజ్ ను వెళ్లగొట్టిన ఎన్టీఆర్

- Advertisement -

ఎన్టీఆర్ బిగ్ బాస్ షో.. తెలుగు బుల్లితెరపై ఇటివలే స్టార్ట్ అయింది. ఇందులో పాల్గోనే పార్టీసిపెంట్స్ కు కాస్తంత గ్రాండ్ గానే వెల్ కమ్ చెప్పారు ఎన్టీఆర్. సాయిబాలాజీ, సంపూర్ణేష్‌ బాబు, సమీర్‌, అర్చన, మధుప్రియ, యాంకర్‌ కత్తి కార్తీక, ఐటెం గాళ్‌ ముమైత్‌ ఖాన్‌, ప్రిన్స్ ,ఆదర్శ్ బాలకృష్ణ, కత్తి మహేష్ ఇల్లా అందరినీ పేరు పేరునా ఆహ్వానించి పరిచయం చేసాడు ఎన్టీఆర్.

అయితే కమెడీయన్ ధన్‌రాజ్‌ కి మాత్రం కాస్త షాక్ ఇచ్చాడు. రావటం రావటంతో ధనరాజ్ కొంచెం డిఫరెంట్ గా ఎంట్రీ ఇవ్వటమే దానికి కారణం. అయితే ఎన్టీఆర్ పిలవకుండానే స్టేజ్ పైకి వెళ్ళడ‌మే కాకుండా.. త‌న తట్ట బుట్టా మొత్తం తీసుకెళ్ళాడు. దాంతో కాస్త చిలిపిగా ఆలోచించి ఎన్టీఆర్ … తన అనుమతి లేకుండా వెళ్ళిన స్టేజ్ పైకి వచ్చిన ధనరాజ్‌ను వెళ్లిపోమన్నాడు. నేను పిలవకుండానే షో లోకి ఎలా వచ్చావు.. అంటూ ఎన్టీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఈ తట్టా బుట్టా ఏంటని ఎన్టీఆర్ ప్రశ్నించడంతో 70 రోజుల పాటు బిగ్ బాస్ ఇంట్లో ఉండాలి కదా, అందుకే ఆవకాయ్ పచ్చడి, సున్నుండలు, బొబ్బట్లు తీసుకొచ్చానని ధనరాజ్ చెప్పడంతో ఇలాంటివన్నీ హౌస్ లోకి అనుమతించరని ఎన్టీఆర్ మండి పడ్డారు. దాంతో కంగారు పడ్డ ధనరాజ్ ఎన్టీఆర్ ను మళ్లీ బ్రతిమాలుకున్నాడు. అయితే వెంటనే ఎన్టీఆర్ నవ్వేసి.. అల్ ది బెస్ట్ చెప్పి హౌస్ లోకి పంపించాడు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -