Thursday, May 16, 2024
- Advertisement -

మంత్రుల‌పై బాబు ఫిర్యాదు చేసిందా…?

- Advertisement -

నంద్యాల ఉప ఎన్నిక‌ను ప్ర‌తీష్టాత్మ‌కంగా తీసుకున్న చంద్ర‌బాబు ఎన్నిక‌ల ప్ర‌చార బాధ్య‌త‌ల‌ను స‌హ‌చ‌ర మంత్రుల‌కు అప్ప‌గించారు. దీంతో మంత్రి అఖిల ప్రియలో ముందున్న దూకుడు ఇప్పుడు క‌నిపించ‌డంలేదు.ప‌రినామాలు చూస్తే మంత్రి ఒంట‌రి అయింద‌నే వార్త‌లు బ‌లంగా వినిపిస్తున్నాయి.

భూమా నాగిరెడ్డి మరణంతో నంద్యాలలో ఉపఎన్నిక అనివార్యమైందన్న విషయం అందరికీ తెలిసిందే. తన తండ్రి నియోజకవర్గంలో జరుగుతున్న ఉపఎన్నికలో అన్నీ తానై ముందుండి నడిపించాలని అఖిల మొదట అనుకున్నారు. అందుకు తగ్గట్లే అభ్యర్ధి భూమా బ్రహ్మానందరెడ్డిని కూడా అఖిలప్రియ చెప్పినట్లే చంద్రబాబునాయుడు ఖరారూ చేశారు.

అన్నీ బాగానే ఉన్న అప్ప‌టినుంచే సీన్ మారిపోయింది.త‌న‌కే ప్రాధాన్య‌త ఇస్తార‌ని అనుకున్న అఖిల‌కు బాబు షాక్ ఇచ్చారు.ప్ర‌చార బాధ్య‌త‌ల‌న్నింటిని సహచర మంత్రులు కాలువ శ్రీనివాసులు, నారాయణ, కెఇ కృష్ణమూర్తిలకు అప్పగించారు. దాంతో అఖిల ఖంగుతిన్నది. ఆ సంగతిని పక్కన బెడితే ప్రతీ రోజూ పలువురు మంత్రులు నంద్యాలకు వచ్చి పోతున్నారు. వీరిలో ఏ ఒక్కరు కూడా అఖిలను కలవటం లేదట. ఎందుకంటే, ఎన్నికను ఒంటరిగా అఖిల ఎదుర్కొనలేందని చంద్రబాబు అనుకున్నారు.

మంత్రుల బాగోగుల‌ను భూమా నాగిరెడ్డి అనుచ‌రుడైన ఏవి సుబ్బారెడ్డికి బాధ్య‌త‌లు అప్ప‌గించారు.నియేజ‌క‌వ‌ర్గంలో ప్ర‌చారానికి వ‌స్తున్న మంత్రులంద‌రిని త‌న ఇంటికి తీసుకెల్ల‌డ‌మో లేకా హోట‌ల్లో బ‌స ఏర్పాట్లు చేస్తున్నారు.ఇది అఖిల‌కు ఏమాత్రం మింగుడు ప‌డ‌టంలేదు.అంటే ఒకరకంగా నంద్యాలకు వస్తున్న మంత్రులందరినీ సుబ్బారెడ్డి హైజాక్ చేస్తున్నట్లే ఉంది.

దాంతో అఖిల బాగా ఇబ్బందులు పడుతోందట. ఇక ఉండబట్టలేక ఇదే విషయాన్ని చంద్రబాబు వద్ద కూడా ఫిర్యాదు చేసిందట. తమ నియోజకవర్గంలోనే తనను అందరూ కలిసి ఒంటిరిని చేస్తున్న విషయాన్ని వివరంగా చెప్పారట. అయితే, మొత్తం విన్న చంద్రబాబు మాత్రం ఏమీ సమాధానం చెప్పకుండానే అఖిలను పంపేసారట.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -