Thursday, May 2, 2024
- Advertisement -

9 భాషల్లోకి రీమేక్ అయిన మన టాలీవుడ్ మూవీ ఏంటో తెలుసా…!

- Advertisement -

ప్రస్తుతం టాలీవుడ్ లో మన దర్శక, నిర్మాతలు పాన్ ఇండియా చిత్రాలను నిర్మించడమే కాకుండా బ్లాక్ బస్టర్ హిట్స్ అందుకొని అద్భుత విజయాలు సాధిస్తున్నారు.ఇప్పటివరకూ ఇతర భాషలకు చెందిన ఎన్నో సినిమాలు తెలుగులో రీమేక్ అయ్యి ఘన విజయాలు సాధించాయి. అయితే ప్రస్తుత కాలంలో మన తెలుగు సినిమా స్థాయి పెరిగి బాలీవుడ్లోకి మరి ఇతర భాషలలోకి రీమేక్ కావడం శుభసూచకమని చెప్పవచ్చు. అయితే మన తెలుగు సినిమాలు కొన్ని ఇతర భాషల్లో సక్సెస్ సాధించి అద్భుతాలు సృష్టించాయి.

టాలీవుడ్ అగ్ర నిర్మాత యం.ఎస్.రాజు 2005 లో హీరో సిద్దార్థ్, త్రిష జంటగా నిర్మించిన ‘నువ్వొస్తానంటే నేనొద్దంటానా’ అనే తెలుగు చిత్రం ఏకంగా 9 భాషల్లోకి రీమేక్ చేయబడింది. ఇందులో 7 భారతీయ భాషలు, 2 విదేశీ భాషల్లోకి రీమేక్ కావడం ఒక సంచలనం. ఈ సినిమాని డాన్స్ మాస్టర్ ప్రభుదేవా దర్శకత్వం వహించాడు.

నువ్వొస్తానంటే నేనొద్దంటానా అనే మూవీ ఏ భాషల్లో రీమేక్ అయ్యిందో అక్కడ ఏ టైటిల్స్ పెట్టి రిలీజ్ చేశారు ఇప్పుడు చూద్దాం. హిందీలో ఈ చిత్రాన్ని ‘రామయ వస్తావయ’ పేరుతో రీమేక్ చేశారు,. ‘ఉనక్కం ఎనక్కం’ పేరుతో తమిళంలో రీమేక్ చేశారు. కన్నడలో ఈ చిత్రాన్ని ‘నీనెల్లో నానల్లే’ పేరుతో, బెంగాలీలో ఈ చిత్రాన్ని ‘ఐ లవ్‌ యు’ పేరుతో ,మణిపురిలో ఈ చిత్రాన్ని నింగోల్‌ తజబ పేరుతో, ఒడియాలో ఈ చిత్రాన్ని ‘సునా ఛాదీ మో రూపా ఛాదీ’ పేరుతో , పంజాబీలో ఈ చిత్రాన్ని ‘తేరా మేరా కీ రిష్తా’ పేరుతోను, బెంగాలీలో ఈ చిత్రాన్ని ‘నిస్సా అమర్‌ తుమీ’ పేరుతో , నేపాలీలో ఈ చిత్రాన్ని ‘ది ఫ్లాష్ బ్లాక్: ఫర్కెరా హెర్దా’ పేరుతో రీమేక్ చేసి రిలీజ్ చేశారు. విడుదలైన అన్ని భాషల్లోనూ ఘన విజయం సాధించడం మరో విశేషం.

పూరి జగన్నాథ్ ఇండస్ట్రీకి పరిచయం చేసిన హీరోయిన్స్..!

ఇంటర్ క్యాస్ట్ పెళ్లిళ్లు చేసుకున్న సెలబ్రీటీలు వీరే..!

మెగాస్టార్ కెరీర్లో అత్యధిక కలెక్షన్స్ రాబట్టిన సినిమాలు..!

టాలీవుడ్ హీరోల పెళ్లిలు.. తీసుకున్న కట్నాలు..!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -