ఒడిశా యువ నటి నిఖిత ఆదివారం మృతి చెందింది. అందుతున్న సమాచారం ప్రకారం నికితప్రమాదవశాత్తు టెర్రస్ పై నుంచి కిందపడి మరణించినట్లు సమాచారం. ఒడిశా టెలివిజన్ రంగంలో బాగా పాపులర్ అయిన నిఖిత, పలు సినిమాలలో కూడా నటించి మంచి పేరు తెచ్చుకుంది.చోరీ చోరీ మానా చోరీ,మా రా పనతకాని,స్మైల్ ప్లీజ్ సినిమాలలో నటించింది నిఖిత. 2016లో లిపన్ సాహు అనే వ్యక్తిని ప్రేమించి పెళ్లి చేసుకుంది నిఖిత. ఆదివారం కావడంతో తండ్రి దగ్గరికి వచ్చింది. అక్కడ ఉన్న టెర్రస్‌పైకి వెళ్లిన నిఖిత ప్రమాదవశాత్తు పైనుంచి కిందపడింది.
వెంటనే ఆమెను ఆసుపత్రిలో చేర్చగా, చికిత్స పొందుతూ ప్రాణాలు విడిచింది. తీవ్ర గాయాలపాలైన నిఖితను తొలుత ప్రైవేటు ఆసుపత్రిలో చేర్చారు.కండిషన్ సీరియస్‌గా ఉండటంతో కటక్‌లోని ఓ ఆస్పత్రికి తరలిస్తుండగా ఆమె మరణించినట్లు నిఖిత కుటుంబ సభ్యులు తెలిపారు.తీవ్ర గాయాల వల్లే ఆమె ప్రాణాలు కోల్పోయినట్టు తెలుస్తోంది. అయితే నిఖిత టెర్రస్‌పైకి ఎందుకు వెళ్లిందనే మాత్రం తెలియడం లేదు.ఆమెకు ఆరు నెలల పాప కూడా ఉంది. గత కొంతకాలంగా భార్య,భర్తల మధ్య విభేదాలు రావడంతో భర్తకు దూరంగా ఉంటున్నట్లు సమాచారం అందుతోంది.
- ఏపీ పోలీసుల తీరుపై హైకోర్టు ఆగ్రహం
- కోమటిరెడ్డి..భోళా మనిషి!
- హైదరాబాద్ మెట్రో ఛార్జీల పెంపు
- ఏపీ ప్లానింగ్ డిపార్ట్మెంట్ పోస్టులకు నోటిఫికేషన్
- రైతులకు గుడ్‌న్యూస్.. ‘ఫార్మర్ ఐడీ’