Friday, April 26, 2024
- Advertisement -

విషాదం : నీట మునిగి 8మంది మృతి.. మరికొంత మంది గల్లంతు!

- Advertisement -

ప్రస్తుతం దేశంలో కరోనా వైరస్ ప్రభావంతో అందరూ ఇంటి పట్టున ఉంటున్నారు. అయితే కరోనా కట్టడి చేయడానికి దేశ వ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో లాక్ డౌన్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ మద్య కరోనా కేసులు తగ్గుముఖం పట్టడంతో లాక్ డౌన్ సడలింపులు చేశారు. ఈ నేపథ్యంలో కొంత మంది యువకులు రదాగా స్నానం చేయడానికి నదులు, సముద్ర తీరాలకు వెళ్లారు. అలా ఈత కోసం వెళ్లిన ఎనిమిది మంది యువకులు మృత్యుపాలయ్యారు. మరికొంత మంది నీటిలో గల్లంతయ్యారు.

తమ తల్లిదండ్రులు, కుటుంబసభ్యులకు తీరని శోకాన్ని మిగిల్చారు. ఒంగోలు మండలం సర్వేరెడ్డిపాలెం గ్రామానికి చెందిన శనగపల్లి శ్రీనివాస్‌(21), ఒంగోలు నగరం గోపాలనగరం మూడో లైన్‌కు చెందిన ఈర్ల సుజిత్‌(21) బాల్య స్నేహితులు. ఆదివారం సెలవు కావడంతో మరో ఇద్దరు ఫ్రెండ్స్‌తో కలిసి బైక్‌లపై కొత్తపట్నం తీరానికి వెళ్లారు. సుజిత్‌, శ్రీనివాస్‌ సముద్రంలోకి దిగడంతో అలల ఉద్ధృతికి ఉక్కిరిబిక్కిరై మృతి చెందారు. శ్రీకాకుళం జిల్లా కవిటి బీచ్‌లో మరో విషాదం చోటుచేసుకుంది.

కవిటి మండలం బొర్రపుట్టుగకు చెందిన బొర్ర సాయిలోకేష్‌(20) పుట్టిన రోజు సందర్భంగా 20 మంది స్నేహితులు గ్రామంలోనే సెలబ్రేట్ చేసుకుని తర్వాత బీచ్‌కి వెళ్లారు. అయిదుగురు సముద్రంలో స్నానాలకు దిగారు. పెద్ద అల రావడంతో నలుగురు గల్లంతయ్యారు. వెంటనే మత్స్యకారులు వారికోసం గాలింపు చేయగా సాయి లోకేష్‌, బొర్ర మనోజ్‌కుమార్‌(21), మరిడి తిరుమల(18)ల మృతదేహాలను బయటికి తీసుకొచ్చారు.

బొర్ర గోపీచంద్‌(18) గల్లంతయ్యాడు. తూర్పుగోదావరి జిల్లా పి.గన్నవరం పరిధిలోని లంకల గన్నవరం వద్ద వశిష్ఠ గోదావరి నదిలో స్నానానికి వెళ్లిన నలుగురు విద్యార్థులు గల్లంతు అయ్యారు. ఏడుగంటలు దాటినా తమ పిల్లలు రాకపోవడంతో గ్రామస్థుల సహాయంతో వశిష్ఠ గోదావరి వద్ద గాలించగా ఇసుక తిన్నెల మీద వారి దుస్తులు, చెప్పులు, రెండు సెల్‌ఫోన్లు కనిపించాయి. దాంతో వారంతా స్నానానికి నదిలో దిగి గల్లంతై ఉంటారని భావిస్తున్నారు. తమ పిల్లలు ఏమయ్యారో తెలీక కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు.

కాంగ్రెస్ పీసీసీ చిచ్చు : తన పదవికి మర్రి శశిధర్ రెడ్డి రాజీనామా

నేటి పంచాంగం,సోమవారం(28-06-2021)

మంత్రి కేటీఆర్ అపురూప జ్ఞాపకం.. ఫోటో వైరల్

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -