Saturday, April 20, 2024
- Advertisement -

బిడ్డ ఎదురుగా కింగ్ కోబ్రా.. ఆ తల్లి ఏం చేసిందంటే?

- Advertisement -

ఎనిమిది అడుగుల కింగ్​ కోబ్రా.. దాన్ని చూస్తూనే ఎవరికైనా వెన్నులో వణుకుపుడుతుంది. భయంకరమైన రూపం. దాని రంగు కూడా చాలా భయంకరంగా ఉంది. అటువంటి పాము ఓ ఇంట్లోకి ప్రవేశించింది. ఇంట్లో రెండేళ్ల బాలుడు ఆడుకుంటున్నాడు. ముందుగా ఆ పాము బాలుడి కంట్లో పడింది. పసిహృదయం .. ఏదో వింత జీవి ఇంట్లోకి వచ్చిందని భావించి ఆ పామును పట్టుకోబోయాడు. దాని వైపుకు కదిలాడు. అంతలోనే తల్లిదండ్రులు అక్కడికి వచ్చారు. తండ్రి ఎలాగోలా బాబును పామును దూరంగా తీసుకెళ్లాడు. అయినా ఆ ఇంట్లో అందరికీ భయం భయంగానే ఉంది. ఆ పామును ఎలా బయటకు పంపించాలో అర్థం కావడం లేదు.

ఇంతలో ఆ బాలుడి తల్లి ధైర్యం చేసింది. ఒంటి చేత్తో ఆ పాము తోక పట్టుకొని దాని బయటకు విసిరేసింది. ఒళ్లు గగుర్పొడిచే ఈ ఘటన.. ఒడిశా రాష్ట్రంలోని మయూరభంజ్‌లో చోటుచేసుకున్నది. మయూరభంజ్‌ కు చెందిన సస్మిత తన భర్తతో కలిసి.. గ్రామంలో ఉంటున్నది. ఇటీవల ఆమె ఇంట్లోకి ఓ పాము వచ్చింది. దీంతో ఆమె ఎంతో ధైర్యంగా ఎనిమిది అడుగుల కింగ్​ కోబ్రాను బయటకు విసిరేసింది. ఈ ఘటన ప్రస్తుతం సంచలనంగా మారింది. ఈ పామును బయటపడేయగానే.. గ్రామస్థులు అటవీ అధికారులకు సమాచారం అందించారు. వారు ఆ పామును పట్టుకొని .. సమీప అడవిలో వదిలివెళ్లారు.

Also Read: ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. !

ఈ ఘటనపై సస్మిత మాట్లాడుతూ.. ‘ ఆ పామును చూసిన క్షణంలో నాకు ఎంతో భయం వేసింది. కానీ ఏం చేయాలో అర్థం కాలేదు. ఓ వైపు నా భర్త, కుమారుడు ఉన్నాడు. వెంటనే ఆ పామును బయటకు విసిరేయాలన్న ఆలోచన ఉంది. దీంతో క్షణం కూడా ఆలోచించకుండా పామును బయట విసిరేశాను’ అని చెప్పింది. ఇప్పుడు ఈ ఘటన నెట్టింట్లో వైరల్​ గా మారింది. బిడ్డ కోసం ప్రాణాలకు తెగించి పామును బయట పడేసిన సదరు మహిళ ధైర్యాన్ని అంతా మెచ్చుకుంటున్నారు. ఎంతైనా అమ్మకు ఎవరూ సాటి లేరంటూ అభినందిస్తున్నారు.

Also Read: కోవాగ్జినా.. కోవిషీల్డా ఏది బెటర్​? ఇదిగో ఆన్సర్​

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -