Monday, May 6, 2024
- Advertisement -

అన్న సినిమాను.. చెల్లె చూడదట

- Advertisement -

“సినిమా బాగా లేకపోతే.. మా అన్న వరుణ్ తేజ్ సినిమానే రెండోసారి చూడను.. అలాంటిది నేను సరిగా నటించకపోతే.. నా తర్వాత సినిమా పరిస్థితి కూడా అంతే. జనం నుంచి, అభిమానుల నుంచి రెస్పాన్స్ ఉండదు” అంటోంది.. మెగా ఫ్యామిలీ నుంచి హీరోయిన్ గా ఇండస్ట్రీలోకి అడుగుపెడుతున్న కొణిదెల నిహారిక.

నాగశౌర్యతో కలిసి నిహారిక నటించిన ఒక మనసు సినిమా.. ఈ నెల 24న రిలీజ్ అవుతోంది. దీంతో.. తన ఎంట్రీ గురించి.. సినిమా గురించి నిహారిక.. బోలెడు కబుర్లు మీడియాతో పంచుకుంది. మరోచరిత్ర, గీతాంజలి లాంటి స్వచ్ఛమైన ప్రేమకథా చిత్రాల జాబితాలో ఒక మనసు నిలుస్తుందన్న నమ్మకం ఉందని నిహా చెప్పింది. అయితే.. పెదనాన్న చిరంజీవి కారణంగానే తన ఫస్ట్ మూవీకి ఇంత హైప్ వచ్చింది కానీ.. యాక్టింగ్ బాగా లేకుంటే తన రెండో సినిమాను ఎవరూ చూడరంటూ.. అభిప్రాయాన్ని ఓపెన్ గా చెప్పేసింది.

అంతే కాదు.. ఇకపై కూడా ఇలాంటి స్వచ్ఛమైన క్యారెక్టర్లే చేస్తా కానీ.. ఎట్టి పరిస్థితుల్లో గ్లామర్ జోలికి వెళ్లేది లేదని క్లియర్ చేస్తోంది. సినిమా నటించే ముందు.. తన ఫ్యామిలీ గురించి.. మెగా అభిమానుల మనోభావాల గురించి కచ్చితంగా ఆలోచిస్తానని.. ఎవర్నీ బాధ పెట్టేలా నటించేది లేదని తేల్చేసింది. నిహారిక కామెంట్లు చూస్తుంటే.. ఇండస్ట్రీపై పక్కా అవగాహన పెంచుకున్నాకే.. యాక్టింగ్ లోకి ఎంటరైనట్టు కనిపిస్తోంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -