Tuesday, May 14, 2024
- Advertisement -

యోగా.. చేస్తున్నారు బాగా

- Advertisement -

బంచిక్ బంబం చెయ్యి బాగా.. ఒంటికి యోగా మంచిదేగా అంటూ.. చాలా కాలం క్రితమే మనం పాటలు పాడుకున్నాం. ఇన్నాళ్లకు యోగాతో ఉపయోగాలు తెలియడంతో.. చాలా దేశాల్లో ఆసనాలు వేసేందుకు అక్కడి జనాలు కూడా ఆరాటపడుతున్నారు. ఈ ప్రభావంతో.. ఐక్యరాజ్యసమితి కూడా.. ఏటా జూన్ 21న అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని నిర్వహిస్తోంది. మరోవైపు.. సమితిలో సభ్యత్వం ఉన్న 193 దేశాల్లో.. ఏకంగా 191 దేశాలు ఈ ఏట యోగా డే సెలబ్రేషన్స్ నిర్వహిస్తున్నట్టు కేంద్రం ప్రకటించింది.

లిబియా, యెమెన్ మాత్రమే యోగాకు దూరంగా ఉన్నట్టు విదేశీ వ్యవహారాల మంత్రి సుష్మా స్వరాజ్ చెప్పారు. తాను పోలండ్ లో జరిగే యోగా సంబురాలకు హాజరుకావాల్సి ఉన్నా.. అనారోగ్య కారణంతో వెళ్లలేకపోతున్నట్టు సుష్మా తెలిపారు. 177 దేశాలు యోగాకు అనుకూలంగా ఓటు వేయడంతో.. యోగా డేకు ఐక్యరాజ్యసమితి కూడా ఓకే చెప్పిన విషయాన్ని గుర్తు చేశారు. అప్పటి నుంచి యోగాకు అంతర్జాతీయంగా ప్రాముఖ్యత పెరుగుతున్నట్టు సుష్మా తెలిపారు.

ఈ ఏడాది కూడా దేశంలోనే కాక.. అంతర్జాతీయంగా ఘనంగా యోగా దివస్ జరగడం ఖాయమంటున్నారు. రీసెంట్ గా.. అమెరికా వెళ్లిన ప్రధాని మోడీ కూడా.. అక్కడి కాంగ్రెస్ లో మాట్లాడుతూ యోగా గురించి ప్రస్తావించారు. విశ్వవ్యాప్తం అవుతున్న యోగాపై ఇండియా పేటెంట్ కోరే ప్రయత్నం చేయదంటూ.. కామెంట్ చేశారు. దీంతో.. భారతీయ సంప్రదాయ విధానమైన యోగాకు అంతర్జాతీయ ఖ్యాతి తేవడమే లక్ష్యంగా కేంద్రం పని చేస్తున్నట్టు కనిపిస్తోంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -