మాస్ మహారాజ రవి తేజ ప్రస్తుతం డిస్కో రాజా అనే చిత్రం తో బిజీ గా ఉన్న సంగతి తెలిసిందే. ఈ నెలాఖరున ఈ సినిమా కి సంబందించిన రెండో షెడ్యూల్ మొదలు కానుంది. అయితే దీని తర్వాత రవి తేజ ఒక మాస్ సినిమా ని లైన్ లో పెడుతున్నట్లు సమాచారం. సాధారణం గా ప్రయోగాలకి దూరం గా ఉండే రవి తేజ ఈ సరి మాత్రం డిస్కో రాజా తో ఒక ప్రయోగాన్ని మన ముందుకు తీసుకొని వస్తున్నాడు. అయితే దీని ఫలితం ఎలా ఉంటుందో అప్పుడే ఊహించడం కుదరదు కనుక వెంటనే ఒక మాస్ సినిమా చేస్తే బాగుంటుంది అనే ఉదేశ్యం తో తనకి రెండు హిట్స్ ని ఇచ్చిన గోపీచంద్ మలినేని దర్శకత్వం లో ఒక సినిమా చేయడానికి ఒప్పుకున్నాడు రవి తేజ.
డాన్ శీను తో ఇండస్ట్రీ లో కి ఎంట్రీ ఇచ్చిన గోపీచంద్ మొదటి సినిమా తో నే విజయం సాధించాడు. ఆ తర్వాత మళ్ళి రవి తేజ తో బలుపు అనే సినిమా చేసాడు. ఇందులో శృతి హాసన్ మరియు అంజలి జంటగా రవి తేజ సరసన నటించారు. అయితే ఈ కొత్త సినిమా కి కూడా గోపి శృతి హాసన్ ని హీరోయిన్ గా పెట్టాలని అనుకుంటున్నాడట. ఈ సినిమా కి సంబందించిన కథా చర్చలు ముగిసాయి. త్వరలో ఈ సినిమా ని అధికారికం గా ప్రకటించనున్నారు.
ఈ లెక్కన మళ్ళి రవి తేజ తన బలుపు ని చూపించబోతున్నాడు.