Monday, April 29, 2024
- Advertisement -

బుల్లితెరపై రవితేజ ఈగల్!

- Advertisement -

రవితేజ హీరోగా డైరెక్టర్ కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ఈగల్. ఫిబ్రవరి 9న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద పాజిటివ్ టాక్‌ రాబట్టింది. ఈ సినిమాతో సక్సెస్ ట్రాక్ ఎక్కారు రవితేజ.

ఇక థియేటర్‌లోనే కాదు ఓటీటీలోనూ సత్తా చాటింది ఈగల్. అమేజాన్ ప్రైమ్ వీడియోలో డిజిటల్ గా రిలీజ్ అయ్యి మంచి వ్యూస్ రాబట్టింది. ఇప్పుడు బుల్లితెరపై అలరించేందుకు వస్తోంది. ఈ సినిమా శాటిలైట్ రైట్స్ ను ఈటీవీ సొంతం చేసుకోగా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది.

రవితేజ సరసన కావ్యా తాపన్ నటించిన ఈ చిత్రంలో అనుపమ పరమేశ్వరన్, నవదీప్, శ్రీనివాస్ అవసరాల తదితరులు కీలక పాత్రల్లో నటించారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై టీజీ విశ్వ ప్రసాద్, వివేక్ కూచిభోట్ల సంయుక్తం గా నిర్మించిన ఈ చిత్రానికి దావ్ జంద్ సంగీతం అందించారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -