శేకర్ కమ్ముల ట్రాక్ లోకి వచ్చేశాడు. అయితే ఈ ట్రాక్ లోకి రావడానికి కాస్త ఎక్కువ టైమే తీసుకున్నాడు.ఫిదా మూవీ హిట్ తో తర్వాత ఏంటి అనే కొశ్చన్ కు మొన్నటి వరకు శేఖర్ దగ్గర సమాధానం లేదు. కాని ఇపుడు వచ్చేసింది.దానికి కారణం రానా. అవును శేఖర్ తర్వాత చేయబోయె సినిమాకు హీరో రానానే.
లీడర్ తో రానా ఎంట్రీకి అవకాశమిచ్చి ఆతర్వాత మరింత ఎదగడానికి సెలెక్టెడ్ చిత్రాలు చేయడానికి శేఖర్ చాలా కారణమయ్యాడు. అదే ఇదితో ఫిదా ఇచ్చిన కిక్ చూసిన రానా మంచి కథతో వస్తే చేద్దామన్నాడట.ఆ కథ ఇపుడు సిద్ధం కావడంతో రానాకు వినిపించాడు. అతనికి ఖథ నచ్చడంతో ఓకే చెప్పేశాడు.
వీళ్లిద్దరి కాంబినేషన్లో ‘లీడర్-2’ఉంటుందని గత కొంతకాలంగా ప్రచారం జరుగుతుంది. కానీ అది ఇంకా కార్యరూపం దాల్చలేదు. రానా డేట్లు ఎప్పుడిస్తాడన్న దానిని ఆధారం చేసుకుని ..ఈ లోపు
పూర్తి స్క్రిప్టు సిద్ధం చేసి … రెండు మూడు నెలల్లో సినిమాను మొదల పెట్టవచ్చంటున్నారు. ఒకవేల వీరిద్దరి కాంబోలో సినిమా మొదలైతే మాత్రం క్రేజ్ ఓ రేంజ్ లో రావచ్చు.