Saturday, April 27, 2024
- Advertisement -

‘కాసుకోర నాని.. నీ టోకెన్ వచ్చింది’ : శ్రీరెడ్డి

- Advertisement -

టాలీవుడ్‌లో క్యాస్టింగ్ కౌచ్‌పై సంచలన ఆరోపణలు చేసిన నటి శ్రీరెడ్డి తాజాగా నానీపై మ‌రో బాంబు పేల్చింది. తెర మీదకు వచ్చేసరికి ఒక్కొక్కడు శ్రీరంగ నీతులు చెప్తారు, మన నేచురల్ స్టార్ నాని ఒక అమ్మాయికి ఒక రోజంతా నరకం చూపించాడు..’ అంటూ ట్వీట్ చేసింది. అంత‌టితో ఊరుకుందా అంటే అదీ లేదు. కాసుకోర నాని నీ టోకెన్ వచ్చింది, నీకు ఫ్యామిలీ ఉందిగా, కొంచెంకూడా సిగ్గు లేదా అలా చేయటానికి ఛి అంటూ ట్విట్ట‌ర్‌లో పోస్ట్ చేసింది.

మరో ట్వీట్‌లో నాని వాయిస్ ఓవర్ ఇచ్చిన ‘అమోలి’ అనే డాక్యుమెంటరీ ఫిల్మ్‌ను షేర్ చేస్తూ.. ‘మంచి షార్ట్ ఫిల్మ్, అందరూ చూడండి.. అంతా బాగుంది కానీ, నాని వాయిస్ ఎందుకు.. వాడే ఒక కామాంధుడు.. మహేష్ బాబు వాయిస్ అయితే చాలా బాగుండేది.. వెన్న లాంటి సున్నితమైన మనసున్న బాబు మా మహేష్ బాబు’ అంటూ రాసుకొచ్చింది.

చట్టాన్ని వాడుకొమ్మని చెప్పారు కాబట్టి.. చట్టాన్ని, పోలీసులను వాడుకుంటానని శ్రీరెడ్డి పేర్కొంది. ‘మాలో ఉన్న కోపం, ఆ కోపం పోరాట రూపం ఎలా దాలుస్తుంది? దాల్చితే ఎలా ఉంటుంది? చూపిస్తాం.. విజయమా, పరాజయమా పక్కనబెట్టండి.. మాకు వచ్చిన కోపానికి మీరు అనుభవించాల్సిందే’ అని శ్రీరెడ్డి చెప్పుకొచ్చింది.

ఇక నుంచి ఏ అమ్మాయి వంకైనా చూడాలన్నా.. కాల్స్, వాట్సాప్ మెస్సెజ్‌లు, పిచ్చి పిచ్చి కాల్స్ చేయాలన్నా భయపడాలని శ్రీరెడ్డి హెచ్చరించింది. తనకు ఫోన్ కాల్స్, మెస్సేజ్‌లు చేసే ప్రతి ఒక్కరిని ఇరికిస్తానని తెలిపింది. అప్పుడు పవన్ కళ్యాణ్ వచ్చి కాపాడతారా.. మరొకళ్లు వస్తారా చూస్తానంటూ హెచ్చ‌రించింది. దీనికి ఎప్పుడు పుల్‌స్టాప్ ప‌డుతుందో చూడాలి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -