Tuesday, May 14, 2024
- Advertisement -

‘ఘూమర్’ పాట‌కు మెస్మ‌రైజ్ డ్యాన్స్‌

- Advertisement -

సంజయ్‌ లీలా భన్సాలీ దర్శకత్వంలో దీపికా పదుకొణె టైటిల్‌ రోల్‌లో ‘పద్మావత్‌’ సినిమా వ‌చ్చి బాలీవుడ్‌లో హిట్ సినిమాగా దూసుకుపోతోంది. ఈ సినిమాపై ఎన్ని వివాదాలు చుట్టుముట్టినా ప్రేక్ష‌కులు ఆద‌రించారు. సినిమా మంచిగా ఆడుతోంది. ఈ సినిమా విశేష ప్రేక్షకాదరణ పొందుతోంది. అయితే ఈ సినిమాలో ‘ఘూమర్..’ పాట అంద‌ర్నీ ఆక‌ట్టుకుంటోంది. ఈ పాట సంగీతం. నృత్య‌ప‌రంగా సూప‌ర్‌గా ఉండ‌డంతో ఈ పాట అంద‌రి నోళ్ల‌ల్లో నానుతోంది. అయితే ఈ పాట‌కు ఓ డ్యాన్స‌ర్ క‌మ్ స్కేట‌ర్ సూప‌ర్‌గా డ్యాన్స్ చేసి అంద‌ర్నీ మెస్మ‌రైజ్ చేశారు. ఆమె స్కేటింగ్ చేస్తూ డ్యాన్స్ చేయ‌డం వావ్ అనిపిస్తోంది. ఆమె ఎవ‌రో తెలుసుకోండి.

మయూరి భండారి అనే స్కేటర్‌ ఐస్‌పై ఘూమ‌ర్ పాట‌కు డ్యాన్స్‌ చేస్తున్నారు. ఆమె చేసిన డ్యాన్స్ వీడియోను యూట్యూబ్‌లో అప్‌లోడ్ చేయ‌డంతో యూట్యూబ్‌లో ట్రెండింగ్‌గా ఉంది. ‘పద్మావత్‌’ చిత్ర బృందానికి ఈ పాటను అంకితం ఇస్తున్నట్లు మ‌యూరి ప్ర‌క‌టించారు. రాజస్థానీ అమ్మాయిగా ఈ పాటకు డ్యాన్స్‌ చేయడం గౌరవంగా భావించినట్లు తెలిపారు. ఈ పాట కొరియోగ్రఫీ బాధ్యతల్ని తనే చూసుకున్నట్లు చెప్పారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -