Sunday, May 5, 2024
- Advertisement -

నాలుగోసారి అండ‌ర్‌-19 వ‌రల్డ్‌క‌ప్ భార‌త్‌కు

- Advertisement -

కుర్రాళ్లు అద్భుతం చేసేశారు. త‌మ సునాయాస ఆట తీరుతో ఆస్ట్రేలియా కంగారుల‌తో పోటీప‌డి ఆడి గెలిచారు. అద్భుతం చేసి వ‌ర‌ల్డ్‌క‌ప్‌ను మ‌రోసారి ముద్దాడారు. అండర్‌-19 ప్రపంచకప్ భార‌త‌దేశం నాలుగోసారి గెలుచుకుంది. సీనియ‌ర్ల క‌న్నా జూనియ‌ర్లు సూప‌ర‌ని నిరూపించారు. భార‌త్ వ‌న్డే వ‌ర‌ల్డ్‌క‌ప్‌లో ద‌శాబ్దాల త‌ర్వాత వ‌ర‌ల్డ్‌క‌ప్ గెలిస్తే కుర్రాళ్లు మాత్రం నాలుగు సార్లు (2000, 2008, 2012, 2018) గెలుచుకున్నారు.

సెమీస్‌లో చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌ను చిత్తుగా ఓడించి ఫైన‌ల్‌కు చేరిన కుర్రాళ్లు శ‌నివారం (ఫిబ్ర‌వ‌రి 4) ఆస్ట్రేలియాతో ఫైన‌ల్ మ్యాచ్ ఆడారు. ఈ మ్యాచ్‌లో తొలుత ఆస్ట్రేలియా బ్యాటింగ్‌కు దిగ‌గా 217 ల‌క్ష్యం భార‌త్‌కు విధించారు. అయితే ఈ ల‌క్ష్యాన్ని భార‌త్ 8 వికెట్ల తేడాతో

ఫైనల్‌లో భారత ఆటగాడు మన్‌జోత్‌ కార్లా అర్ధశతకం పూర్తి చేశాడు. ఈ టోర్నమెంట్‌లో కార్లాకి ఇది రెండో అర్ధశతకం. ఓపెనర్‌ పృథ్వీ షా (29) ఔటయ్యాడు. మంజోత్ క‌ల్రా సెంచ‌రీ (101)తో మెరిశాడు. 2000, 2008, 2012 అండ‌ర్‌-19 వ‌ర‌ల్డ్‌క‌ప్ భార‌త్ గెలిచింది. ఇప్పుడు 2018లో భార‌త్ మ‌రోసారి స‌త్తా చాటింది. తొలి మ్యాచ్‌లో ఓడినా ఆ త‌ర్వాత ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోకుండా భార‌త్ అజేయంగా విజ‌యాలు సాధిస్తూ చివ‌రికి ఫైన‌ల్‌లో విజ‌యం పొంది వ‌ర‌ల్డ్‌క‌ప్‌ను నాలుగోసారి భార‌త్‌కు వ‌చ్చేలా చేశారు.

పృథ్వీ షా (కెప్టెన్‌), మంజోత్‌ కల్రా, శుభ్‌మన్‌ గిల్, హార్విక్‌ దేశాయ్, రియాన్‌ పరాగ్, అభిషేక్‌ శర్మ, అనుకూల్‌ రాయ్, కమలేశ్‌ నాగర్‌కోటి, శివం మావి, ఇషాన్‌ పోరెల్, శివసింగ్ ఆట‌లోకి దిగారు. బాలింగ్, ఫిల్డింగ్‌, బ్యాటింగ్ ఇలా అన్ని దాంట్లో మెరిసి భార‌త్‌కు మ‌రో విజ‌యం అందించారు. కోచ్ భార‌త కోచ్ రాహూల్ ద్ర‌విడ్‌కు మంచి కానుకగా కుర్రాళ్లు ఇచ్చారు.

ఆస్ట్రేలియా జ‌ట్టు: జాసన్‌ సంఘా (కెప్టెన్‌), జాక్‌ ఎడ్వర్డ్స్, మ్యాక్స్‌ బ్రయాంట్, పరమ్‌ ఉప్పల్, మెక్‌ స్వీనీ, జొనాథన్‌ మెర్లో, విల్‌ సదర్లాండ్, బాక్ట్స్‌ర్‌ హోల్ట్, జాక్‌ ఎవాన్స్, ర్యాన్‌ హ్యాడ్లీ, పోప్‌.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -