‘పంచ‌తంత్ర క‌థ‌లు’ ట్రైల‌ర్ చాలా బాగుంది : ఎం.ఎం.కీర‌వాణి

- Advertisement -

ఐదు వేరు వేరు క‌థ‌లతో ఆంథాల‌జీ మూవీగా తెర‌కెక్కుతోన్న‌ చిత్రం ‘పంచ‌తంత్ర క‌థ‌లు’. మ‌ధు క్రియేష‌న్స్ ప‌తాకంపై ప్రొడ‌క్ష‌న్ నెం.1గా ప్ర‌ముఖ వ్యాపార‌వేత్త డి. మ‌ధు నిర్మిస్తున్నారు. ఈ మూవీ ద్వారా గంగ‌న‌మోని శేఖ‌ర్ ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌య‌మ‌వుతు న్నారు. నోయెల్, నందిని రాయ్‌, సాయి రోనక్‌, గీత భాస్క‌ర్‌, ప్ర‌ణీత ప‌ట్నాయ‌క్‌, నిహాల్ కోద‌ర్తి, సాదియ‌, అజ‌య్ క‌తుర్వ‌ర్ ముఖ్య పాత్ర‌ల‌లో న‌టిస్తున్నారు. ఇప్ప‌టికే ఈ చిత్రం నుండి విడుద‌ల చేసిన మోతెవ‌రి సాంగ్ ట్రెమండ‌స్ రెస్పాన్స్‌తో చార్ట్ బ‌స్ట‌ర్‌గా నిలిచింది. తాజాగా ఈ మూవీ ట్రైల‌ర్‌ను ప్ర‌ముఖ సంగీత ద‌ర్శ‌కుడు ఎం.ఎం.కీర‌వాణి విడుద‌ల చేశారు…

గంగ‌న‌మోని శేఖ‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో మ‌ధు క్రియేష‌న్స్ ప‌తాకంపై పంచ‌తంత్ర క‌థ‌లు అనే ఈ ఆంథాల‌జీ ఐదు వేరు వేరు క‌థ‌లు..వేరు వేరు జోన‌ర్ల‌లో రావ‌డం చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంది. ట్రైల‌ర్ చాలా బాగుంది. క్యారెక్ట‌రైజేష‌న్స్ అన్నీ కొత్త కొత్త‌గా ఉన్నాయి. అన్నింటిని మించి మా ఫ్యామిలీ మెంబ‌ర్ నోయెల్ ఈ సినిమాలో న‌టిస్తున్నాడు. ఈ సినిమా కోసం చాలా ఈగ‌ర్‌గా వెయిట్ చేస్తున్నాను అన్నారు ప్ర‌ముఖ సంగీత ద‌ర్శ‌కుడు ఎం.ఎం.కీర‌వాణి.

- Advertisement -

ఈ సినిమా ఇటీవ‌ల సెన్సార్ కార్య‌క్ర‌మాలు పూర్తిచేసుకుని యు/ ఎ స‌ర్టిఫికేట్ పొందింది. సెన్సారు స‌భ్యులు ఈ సినిమా చూసి చిత్ర యూనిట్‌ను అభినందించారు. అతి త్వ‌ర‌లో ఈ చిత్రం విడుద‌ల‌ తేధిని ప్ర‌క‌టించ‌నున్నారు.

తారాగ‌ణం: నోయెల్, నందిని రాయ్‌, సాయి రోనక్‌, గీత భాస్క‌ర్‌, ప్ర‌ణీత ప‌ట్నాయ‌క్‌, నిహాల్ కోద‌ర్తి, సాదియ‌, అజ‌య్ క‌తుర్వ‌ర్ త‌దిత‌రులు

సాంకేతిక వ‌ర్గం
నిర్మాణ సంస్థ‌: మ‌ధు క్రియేష‌న్స్‌
నిర్మాత‌: డి. మ‌ధు
ర‌చ‌న‌-ద‌ర్శక‌త్వం: గంగ‌న‌మోని శేఖ‌ర్‌
సంగీతం: క‌మ్రాన్‌
కో ప్రొడ్యూస‌ర్‌: డి. ర‌వీంద‌ర్‌
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూస‌ర్‌: పాల‌కూరి సాయికుమార్‌
మాట‌లు, లైన్ ప్రొడ్యూస‌ర్‌: అజ‌ర్ షేక్‌
సినిమాటోగ్ర‌ఫి: గంగ‌న‌మోని శేఖ‌ర్‌, విజ‌య్ భాస్క‌ర్ స‌ద్దల‌
ఎడిట‌ర్‌: శ్రీ‌నివాస్ వ‌ర‌గంటి
కాస్టూమ్ డిజైన‌ర్, స్టైలిస్ట్‌: రితీషా రెడ్డి
సౌండ్ డిజైన‌ర్‌: నాగార్జున తాళ్ల‌ప‌ల్లి
లిరిక్స్‌: సుద్దాల అశోక్ తేజ‌, కాస‌ర్ల శ్యాం, మామా సింగ్‌
పిఆర్ఓ: శ్రీను దుద్ది, సిద్ధు

Related Articles

- Advertisement -

Most Read

- Advertisement -