Saturday, April 20, 2024
- Advertisement -

పరిస్థితి మళ్ళీ మొదటికి.. పాపం లంక !

- Advertisement -

శ్రీలంకలో పెను ఆర్థిక సంక్షోభం ఏ స్థాయిలో ఉందో తెలిసిందే. సామాన్య ప్రజలకు ఒక్క పుట తినడానికి తిండి కూడా దొరకని దుర్భర పరిస్థితులో ప్రస్తుతం శ్రీలంక ఉంది. దేశంపై పడ్డ అప్పుల భారం ఆ దేశ ఆర్థిక వ్యవస్థను అతలాకుతలం చేశాయి. దాంతో తీవ్ర ఆర్థిక, ఆహార సంక్షోభం తలెత్తడంతో దేశ వ్యాప్తంగా ప్రజలు కొన్ని రోజులుగా ప్రజలు నిరసనలు చేపడుతున్నారు. దేశాన్ని ఓ కొలిక్కి తీసుకురావాల్సిన ప్రభుత్వాలు సైతం చేతులెత్తేయడంతో తమ దేశాన్ని కాపాడేదేవరంటూ ప్రజలు ఆర్తనాదలు చేస్తున్నారు. శ్రీలంకలో ప్రభుత్వాలు మారుతున్నప్పటికి పరిస్థితులు మాత్రం మారడం లేదు. దేశాన్ని గాడిన పెట్టడం తమవల్ల కాదని ఇప్పటికే మహింద రాజపక్ష, చహల్ రాజపక్ష, బాసిల్ రాజపక్ష వంటి వారు ప్రధాని పదవి నుంచి దిగిపోయారు. ఇక తాజాగా ప్రస్తుతం ప్రధానిగా కొనసాగుతున్న రనిల్ విక్రమ్ శింగే కూడా రాజీనామా ప్రకటించడంతో దేశంలో మరోసారి నిరసన జ్వాలలు తార స్థాయికి చేరుకున్నాయి. ప్రభుత్వాల అసమర్థతను జీర్ణించుకోలేని ప్రజలు ప్రధాని నివాసంపై దాడికి దిగారు..

ప్రధానికి చెందిన వాహనాలను ధ్వంసం చేశారు. నిరసన కారుల ఆగ్రహ జ్వాలలో ప్రధాని రనిల్ విక్రమ్ శింగే నివాసం పూర్తిగా ధ్వంసం అయినట్లు ఆ దేశ మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఇక శ్రీలంక అధ్యక్షుడు గోటబాయ రాజపక్ష కూడా దేశం విడిచి పారిపోయినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో వేల సంఖ్యలో నిరసనకారులు రాజధాని కొలంబో లోని అధ్యక్ష కార్యాలయాన్ని, అధికార నివాసాన్ని ముట్టడించి విద్వాంసకాండ సృష్టించారు.

భద్రత సిబ్బంది కాల్పులు జరుపుతూ నిరువరించేందుకు ఎన్ని ప్రయత్నాలు చేసిన ఎలాంటి ఫలితం లేకపోయింది. దేశాన్ని గాడిలో పెట్టాల్సిన దేశాద్యక్షుడు, ప్రధాన మంత్రి వంటి వారే దేశం విడిచి పారిపోయే పరిస్థితులు ఏర్పడడంతో శ్రీలంకను ఆదుకునే దేశాల కోసం ప్రజలు కన్నీతో ఎదురు చూస్తున్నారు. ఈ నేపథ్యంలో శ్రీలంక ను మన దేశంలో విలీనం చేస్తే తప్పా .. ఆ దేశ పరిస్థితి గాడిన పడే అవకాశం లేదని సోషల్ మీడియా లో చాలమంది తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. మరి ఇంత క్లిష్ట పరిస్థితుల్లో శ్రీలంకను కాపాడేందుకు ఏ దేశాలు ముందుకు వస్తాయో చూడాలి.

Also Read

భారత్ అంటే రష్యాకు ఎంత ప్రేమో !

గూగుల్ మ్యాప్స్ లో క్రేజీ ఫీచర్ ..సూపర్ !

“అగ్నిపథ్” పై రచ్చ.. అసలేంటి ?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -