ఈ మధ్య బాలీవుడ్ హీరోయిన్స్ సినిమాలతో కన్నా ఫోటో షూట్‌లతోనే ఎక్కువ సమయం గడుపుతున్నారు. అదే ఏంటీ ఫోటో షూట్‌లు ఎందుకు అనే కదా మీ డౌట్. ఏం లేదండీ హీరోయిన్స్ అంటే అందానికే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తుంటారు. ఇలా ఫోటో షూట్‌ల ద్వారా తమ అందాలకు మరింత పదును పెడుతున్నారు హీరోయిన్స్.
తాజాగా అలాంటి ఫోటో షూట్‌తోనే రెచ్చిపోయింది బాలీవుడ్ హీరోయిన్ పరిణీతి చోప్రా. ఇన్నాళ్లు దాచిన అందాల్ని ఒక్కొక్కటిగా బయటకు ఆవిష్కరిస్తూ సెగలు పుట్టిస్తోంది. ఇటీవలే ఫిలింఫేర్ మ్యాగజైన్ ఫోటోషూట్ లో పాల్గొన్న పరిణీతి రకరకాల ఫోజుల్లో మతులు చెడగొట్టింది. తాజాగా మరో స్పెషల్ హిడెన్ ఫోటోని లీక్ చేసి అంతే వేడెక్కించింది. ఆమె అందానికి బులుగు సముద్రం ఎర్రని కెరటాలతో విరుచుకుపడినా ఆశ్చర్యపోనక్కర్లేదు. ఇప్పటికే బికినీ ఫోటోలు ఇండస్ట్రీ వర్గాలు సహా అందరిలోనూ హాట్ టాపిక్ అయ్యాయి. అక్క ప్రియాంకకు పెళ్లి కుదిరిన దగ్గర నుంచి ఎక్కడ తగ్గడం లేదు పరిణీతి.