Thursday, May 16, 2024
- Advertisement -

అసిస్టంట్ డైరెక్టర్స్ కి అవకాశం!

- Advertisement -

పవన్ ఎవరికైన మాట ఇస్తే ఖచ్చితంగా సహయం చేస్తాడు. తనకు కావాల్సిన వారు అయిన అభిమానులైన కష్టలల్లో ఉంటే పవన్ అసలు తట్టుకోలేడు. పవన్ మనస్సు ఎంత మంచిదో అందరికి తెలిసిన విషయమే. అయితే ‘సర్దార్ గబ్బర్ సింగ్’ చిత్రం రూపొందించే సమయం లో వారి వర్క్ , టాలెంట్ తో నలుగురు అసిస్టంట్ డైరెక్టర్స్ పవన్ కళ్యాణ్ ని ఇంప్రెస్ చేసారు.

పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ఎస్.జే.సూర్య దర్శకత్వం లో రూపొందబోతున్న చిత్రానికి సైన్ చేసారు.ఈ చిత్రం ఇటీవల లాంచ్ అయ్యింది.’సర్దార్ గబ్బర్ సింగ్’ చిత్రానికి వర్క్ చేసిన ఆ నలుగురు అసిస్టంట్ డైరెక్టర్స్ ని ఎస్.జే.సూర్య చిత్రానికి కూడా వర్క్ చేసేలా పవన్ ప్లాన్ చేసి ఆ అసిస్టంట్ డైరెక్టర్స్ కి అవకాశం నించారు. దీంతో ఆ నలుగురు అసిస్టంట్ డైరెక్టర్స్ చాలా సంతోషంగా ఉన్నారు.

చాలామంది అసిస్టంట్ డైరెక్టర్స్ ని ఎవరు పట్టించుకోరు. టాప్ పోసిషన్ లో ఉండే ఫిలిం మేకర్స్ మాత్రమే అసిస్టంట్ డైరెక్టర్స్ కి తగ్గ రెన్యుమరేషణ్ ని ఇస్తారు. పవన్ కళ్యాణ్ -ఎస్.జే.సూర్య కాంబినేషన్ లో ఫ్యాక్షన్ లవ్ స్టొరీ రూపొందించబడుతుంది.ఈ చిత్రం లో పవన్ సరసన మలయాళం హీరోయిన్ నటి౦చబోతుంది అనే వార్తలు వినిపిస్తున్నాయి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -