Monday, April 29, 2024
- Advertisement -

బాహుబలి కంటే మగధీర అద్భుతమైన సినిమా!

- Advertisement -

పవన్ తన సినిమా ప్లాప్ అయిన హిట్ అయిన పెద్దగా ఏం మాట్లాడడు. తన సినిమాల గూరించే ఎక్కువగా మాట్లాడని పవన్ వేరే సినిమాల గురించి మాట్లాడటం చాలా తక్కువ. రెండు భారీ సినిమాల మధ్య పోలిక గురుంచి పవన్ మాట్లాడం కొంత ఆసక్తి కలిగించే విషయమే. ఓ ఇంటర్వ్యూలో రాజమౌళి తీసిన రెండు విజువల్ వండర్స్ మధ్య పోలిక తెచ్చాడు పవన్. బాహుబలి కంటే కూడా మగధీర అద్భుతమైన సినిమా అని పవన్ వ్యాఖ్యానించాడు.

కానీ ఆ సినిమాను వేరే భాషల్లో సరిగా ప్రమోట్ చేయలేదని.. సరిగా రిలీజ్ చేయలేదని ఆవేదన వ్యక్తం చేశాడు. కోలీవుడ్ సినిమాలకు మన దగ్గర మంచి మార్కేట్ ఉంది. కానీ మనకు కోలివుడ్ లో మాత్రం ఏ మాత్రం మార్కేట్ లేదు. మనం ఇక్కడ 40-50 కోట్లు పెట్టి తీసే సినిమాను తమిళంలో 50 లక్షలకు కూడా ఎవ్వరూ కొనరు. కానీ తమిళంలో 30 కోట్లు పెట్టి సినిమా తీస్తే మూడింట రెండొంతుల డబ్బులు తెలుగులోనే వచ్చేస్తాయి. మన చిత్రాలను వేరే భాషల్లోకి తీసుకెళ్ళే విషయంలో మన నిర్మాతలు దైర్యం చేయడం లేదు.

 ‘మగధీర’నే తీసుకుంటే అది అద్భుతమైన సినిమా. కానీ దాన్ని వేరే భాషల్లో సరిగా ప్రమోట్ చేయలేదు. బాహుబలి కంటే ముందు దాన్నే హిందీలో రిలీజ్ చేయాల్సింది. సరిగా ప్రమోట్ చేయాల్సింది. అలా చేస్తే బాహుబలి కంటే బాగా ఆడేది. ఇప్పటికైనా మన నిర్మాతలు మేల్కోవాలి. మన సినిమాలకు వేరే భాషల్లో మార్కెట్ పెంచుకోవాలి. సో ఫలితం ఎలా ఉంటుందో అనే విషయం అలోచించకుండా సర్దార్ సినిమాని హిందీ లో రిలీజ్ చేశాం అని పవన్ అన్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -