Thursday, May 9, 2024
- Advertisement -

కోట్ల రూపాయల కోసం పవన్ కక్కుర్తి…… సొంత సినిమా అయినా కూడా వద్దన్న ఎన్టీఆర్

- Advertisement -

యంగ్ టైగర్ ఎన్టీఆర్, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్……..ఇద్దరూ కూడా తెలుగు నాట సూపర్ ఫాలోయింగ్ ఉన్న హీరోలే. ఇద్దరి సినిమాలూ కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర రికార్డ్ స్థాయి కలెక్షన్స్ సాధిస్తాయి. ఎన్టీఆర్‌తో పోల్చుకుంటే నటనలోనూ, డ్యాన్సుల విషయంలోనూ పవన్‌ది వెనకడుగే. అయితే అభిమానులు మాత్రం ఇతర హీరోలతో పవన్ వ్యక్తిత్వాన్ని పోల్చుతూ ఆ రకంగా పవన్ గొప్పవాడని చెప్తూ ఉంటారు. అభిమానులకు అలాంటి సరుకును కూడా పవనే తన మాటలతో ఇస్తూ ఉంటాడు. తన సినిమా ఫ్లాప్ అయితే బాధపడతానని మహేష్‌తో సహా ఇతర హీరోలు చెప్పినప్పుడు…… పవన్ కళ్యాణ్ మాత్రం వెరైటీగా తన సినిమాలు ఫ్లాప్ అయినా బాధపడనని, సక్సెస్ అయినా పొంగిపోనని చెప్తాడు. ఇక ఇలాంటి వీడియోలను పవన్ టీం అందరూ తయారు చేసి యూట్యూబ్‌లో వదుల్తూ పవన్ క్రేజ్‌ని పెంచుతూ ఉంటారు. అలాగే డబ్బులంటే తనకు అస్సలు పడదు అన్నట్టుగా మాట్లాడుతూ ఉంటాడు పవన్. ఆ వీడియోలు కూడా యూట్యూబ్‌లో చాలానే ఉంటాయి. అయితే మాటలు చెప్పడం చాలా ఈజీ. అలాగే మాటలు నమ్మ మోసపోవడం కూడా తప్పు. ఒక మనిషి చేతలను బట్టి నిర్ణయానికి వస్తే అసలు విషయాలు తెలిసిపోతాయి.

అత్తారింటికి దారేది లాంటి ఇండస్ట్రీ హిట్ తనకు అందించిన ప్రొడ్యూసర్ బివిఎస్ఎన్ ప్రసాద్ సినిమా నాన్నకు ప్రేమతో రిలీజ్‌కి ముందు రోజు తనకు ఇవ్వాల్సిన డబ్బులు ఇవ్వకపోతే సినిమా రిలీజ్ ఆపేస్తానని పంచాయతీ పెట్టాడు పవన్. సాటి హీరో సినిమా రిలీజ్ ఆపేయాలన్నంత స్థాయిలో యాగీ చేసిన తెలుగు స్టార్ హీరో మరొకరు కనిపించరు. ఇక సర్దార్ గబ్బర్‌సింగ్, కాటమరాయుడు సినిమాలను ఛీప్‌గా చుట్టేసి దాదాపు డెబ్భై కోట్లకు పైగానే వెనకేసుకున్నాడు పవన్. అన్నింటికీ మించి తనపై అభిమానంతో ఆ సినిమాలు కొని పూర్తిగా నష్టపోయిన తన అభిమానులు నిరాహార దీక్ష చేస్తే పవన్ చుట్టూ ఉన్న మాఫియా వాళ్ళను బెదిరించింది. ఈ విషయాన్ని పవన్ అభిమాని అయిన ఆ డిస్ట్రిబ్యూటరే చెప్పాడు.

ఇక ఇప్పుడు తాజాగా మరోసారి తన నైజాన్ని బయటపెట్టుకున్నాడు పవన్. తన సినిమాను చూడమని అభిమానలను ఎప్పుడూ అడగలేదని గొప్పగా చెప్పుకుంటూ ఉంటాడు పవన్. కానీ ఇప్పుడు తన సినిమాను చూడమని చెప్పి స్వయంగా ఎన్ఆర్ఐ అభిమానులకోసం ఒక వీడియో చేశాడు పవన్. అయితే ఆ వీడియోలో ఎక్కడా కూడా తన సినిమాను చూడమని పవన్ అడగలేదుకదా అని కొంతమంది వాదిస్తున్నారు. కానీ సినిమా రిలీజ్‌కి నాలుగు రోజుల ముందు ఎన్ఆర్ఐల కోసం వీడియో ఎందుకు చేసినట్టు? తన బద్రి సినిమా రికార్డుల గురించి ఇప్పుడెందుకు చెప్పినట్టు? అలాగే ఆ వీడియోతో ఎన్ఆర్ఐలకు ఏం సందేశం ఇస్తున్నట్టు అన్న విషయాలను పరిశీలిస్తే అసలు విషయం ఎవరికైనా అర్థమైపోతుంది. కొంతమంది డైరెక్ట్‌గా విషయం చెప్తారు. కానీ పవన్ లాంటి వాళ్ళు మాత్రం మాటలు గొప్పగా చెప్తూ తమ పబ్బం గడుపుకుంటూ ఉంటారు. తన సినిమాను చూడమని చెప్పి పవన్ కళ్యాణ్ ఈ వీడియో చేశాడన్నది ఎవరికైనా అర్థమయిపోయే విషయమే. మరి తన సినిమాలను చూడమని అభిమానులకు చెప్పను అని డప్పాలు కొట్టడం ఎందుకు? అజ్ఙాతవాసి సినిమా లాభాల్లో పర్సెంటేజ్ మాట్లాడుకున్న పవన్ ఇప్పుడు ఆ లాభాల కోసం కెసీఆర్‌ని కలిసి టిక్కెట్ రేట్లు, షోలు పెంచుకోవడంతో సహా అన్ని ప్రయత్నాలు చేస్తున్నాడన్నది నిజం.

ఇదే సందర్భంలో ఎన్టీఆర్ గొప్పదనం గురించి కూడా చెప్పుకోవాలి. తన సొంత సోదరుడు కళ్యాణ్ రామ్ నిర్మించిన ‘జైలవకుశ’ సినిమా కోసం ఇలాంటి వీడియోనే చేయమని చెప్పి ఓవర్సీస్ డిస్ట్రిబ్యూటర్స్ ఇలాంటి వీడియోనే ఒకటి చేయమని అడిగారు. అయితే ఎన్టీఆర్ మాత్రం…….‘డబ్బుల కోసమే ఎన్ఆర్ఐల పైన ప్రేమ చూపించినట్టు ఉంటుంది……వద్దు’ అని చెప్పేశాడు. ఎవరి వ్యక్తిత్వం ఏంటో ఇప్పుడిక సినిమా లవర్సే చెప్పాలి మరి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -