Monday, April 29, 2024
- Advertisement -

అజ్ఙాతవాసి ఆడియో ఫ్లాప్…… ఇక పవన్ మేనియా, త్రివిక్రమ్ డైలాగులే కాపాడాలి

- Advertisement -

అత్తారింటికి దారేది లాంటి ఇండస్ట్రీ హిట్ కొట్టిన కాంబినేషన్…. డైలాగ్స్‌తో మెస్మరైజ్ చేస్తూ సకుటుంబ సపరివార సమేతంగా ప్రేక్షకులను థియేటర్‌కి రప్పించే స్థాయి ఉన్న డైరెక్టర్…. తెలుగు సినిమా ఇండస్ట్రీలోనే అత్యంత ఎక్కువ హార్డ్ కోర్ ఫ్యాన్స్ ఉన్న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్…… ఇలాంటి కాంబినేషన్‌లో వస్తున్న సినిమా ఆడియో అంటే ఎలా ఉండాలి? ఇండస్ట్రీ హిట్ స్థాయి రేట్లకు అన్ని ఏరియాల్లోనూ బిజినెస్ చేసుకుంటున్న సినిమా ఆడియో ఏ స్థాయిలో ఉండాలి? అజ్ఙాతవాసి అలా ఉందా?

కచ్చితంగా లేదు. గబ్బర్‌సింగ్, అత్తారింటికి దారేది సినిమాలతో పోల్చుకుంటే ఈ ఆడియో చాలా చాలా వీక్ అని చెప్పొచ్చు. గబ్బర్‌సింగ్, అత్తారింటికి దారేది సినిమాల ఆడియోలో అన్ని సాంగ్స్ కూడా బ్లాక్ బస్టర్ హిట్స్. ఆల్బంలో ఉన్న సాంగ్స్ అన్నీ ఆడియెన్స్‌ని మెస్మరైజ్ చేశాయి. కానీ అజ్ఙాతవాసి ఆడియోలో మాత్రం ఒకటి రెండు సాంగ్స్ కూడా అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చేలా లేవు. బయటికెళ్ళి చూస్తే సాంగ్ మాత్రం బెటర్‌గా ఉంది. ఆ విషయం తెలిసే మేకర్స్ ఆ సాంగ్‌ని ముందుగా రిలీజ్ చేసినట్టుగా అనిపిస్తోంది. ఇక మిగతా సాంగ్స్ అన్నీ కూడా యావరేజ్ స్టాండర్డ్స్‌లో ఉన్నాయి. ఒకటి రెండు సాంగ్స్ అయితే బాగా లేవు కూడా. అనిరుధ్ ఇన్‌స్ట్రుమెంటేషన్ కూడా హాంట్ చేసే స్థాయిలో లేదు. సాహిత్యం మొత్తం త్రివిక్రమ్ శ్రీనివాస్‌నే దగ్గరుండి చూసుకున్నప్పటికీ ప్రేక్షకులను మెప్పించే స్థాయిలో లేదు. ‘అ…ఆ’ సినిమా స్థాయిలో కూడా ఈ సాంగ్స్ లేకపోవడం గమనార్హం. ఇప్పటి వరకూ ఇండస్ట్రీ హిట్ కొట్టిన సినిమాలన్నీ కూడా బ్లాక్ బస్టర్ రేంజ్ ఆడియో ఉన్నవే. మరి ఇప్పుడు అజ్ఙాతవాసి ఆడియో ఫ్లాప్ అయిన నేపథ్యంలో ఇక త్రివిక్రమ్ రైటింగ్ స్కిల్స్, పవన్ కళ్యాణ్ మేనియానే ఈ సినిమాను నిలబెట్టాలి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -