Thursday, May 9, 2024
- Advertisement -

గుజరాత్ విన్ః బాబు రాజకీయ వ్యూహం…. వైఎస్ మరణం తర్వాత… మళ్ళీ ఇప్పుడు….

- Advertisement -

చంద్రబాబులో ఉన్న రాజకీయ నాయకుడు నిద్రలేచాడు. అఫ్కోర్స్ చంద్రబాబులో ఉన్న రాజకీయ నాయకుడు ఎప్పుడూ వ్యూహాలు పన్నుతూనే ఉంటాడన్నది నిజం. దేశంలో ఉన్న నాయకులు అందరూ కూడా ఐదేళ్ళ కాలంలో కొంత కాలం మాత్రమే రాజకీయాలు చేస్తారు. కానీ చంద్రబాబు మాత్రం అనుక్షణం రాజకీయం చేస్తూనే ఉంటాడు. ఇక తన ఇంట్లో ఉన్న పసివాడి దగ్గర నుంచీ తన తిండి, స్నానంతో సహా కాదేదీ రాజకీయానకనర్హం అన్నట్టుగా ఉంటుంది బాబు శైలి.

వైఎస్సార్ మరణం తర్వాత జరిగిన సంతాప సభలో రాష్ట్రంలో ఉన్న ప్రజలు, అన్ని పార్టీల నాయకులు కూడా మావనీయ కోణంలో స్పందించారు. అప్పటికి రాజకీయంగా ఓనమాల దశలో ఉన్న చిరంజీవి అయితే వైఎస్సార్‌ని ఆకాశానికెత్తేశాడు. ఇక టీఆర్ఎస్ పార్టీ కూడా వైఎస్‌ని ఘనంగా పొగిడింది. కానీ చంద్రబాబు మాత్రం చాలా జాగ్రత్తగా వైఎస్సార్ గురించి మాట్లాడాడు. ఆ తర్వాత జగన్‌తో పోటీ పడాల్సి ఉంటుందన్న విషయాన్ని గట్టిగా గుర్తుంచుకుని వైఎస్సార్‌ని పొగిడితే …. భవిష్యత్‌లో ఎక్కడ ఇబ్బందిపడాల్సి వస్తుందోనని పొడి పొడి మాటలతో…… జగన్‌కి రాజకీయంగా ఎలాంటి లాభం కలగకుండా ఉండేలా, అలాగే వైఎస్సార్‌ ఇమేజ్‌కి కాస్త కూడా పాజిటివ్ అయ్యే అవకాశం లేకుండా పోగిడాడు చంద్రబాబు. బాబు భజన బృందంలో నంబర్ ఒన్ మీడియా సంస్థ అయినా ఆంద్రజ్యోతి ఎండి రాధాకృష్ణ కూడా అప్పట్లో బాబు రాజకీయ జాగ్రత్తలు తీసుకుని వైఎస్సార్ సంతాప సభలో జాగ్రత్తగా, వ్యూహాత్మకంగా ప్రసంగించాడని, చిరంజీవి మాత్రం భవిష్యత్‌లో అదే వైఎస్సార్ వారసత్వంతో పోటీ పడాల్సి ఉంటుందన్న ఇంగితం లేకుండా మాట్లాడేశాడని రాసుకొచ్చాడు. రాధాకృష్ణ కూడా బాబు తరహాలోనే చనిపోతే మాత్రం ఆయా వ్యక్తుల తప్పులు చెప్పకుండా ఉంటామా? బ్రతికుండగా తప్పులు చేసిన వాళ్ళందరినీ చనిపోయిన వెంటనే పొగిడేయాలా? అంటూ దబాయించాడు. మీడియా స్వేచ్ఛను హరించిన వైఎస్సార్‌ని ఎందుకు పొగడాలి అన్నట్టుగా రాశాడు ఆర్కే. వైఎస్సార్ చనిపోయిన తర్వాత చిరంజీవి చూపించింది మానవత్వం. చంద్రబాబు చేసింది రాజకీయం. కానీ రాధాకృష్ణకు మాత్రం చంద్రబాబు రాజకీయమే గొప్పగా కనిపించింది. చిరంజీవి చూపించిన మానవత్వం తక్కువగా కనిపించింది. ముఫ్ఫై ఏళ్ళపాటు స్నేహితుడిగా, చంద్రబాబు పెళ్ళి, ఇంకా ఇతర పర్సనల్ విషయాల్లో కూడా కలిసి మెలిసి ఉన్న వైఎస్సార్‌ చనిపోయిన తర్వాత వాళ్ళు ఇచ్చిన గౌరవం అది.

ఆ విషయం పక్కన పెడితే ఇప్పుడు గుజరాత్ విజయం తర్వాత కూడా అలాంటి రాజకీయ వ్యూహం ప్రదర్శించాడు చంద్రబాబు. సందర్భం అంత తీవ్రమైనది కాకపోయినప్పటికీ తన అభివృద్ధి జోడీ అని 2014 ఎన్నికల సందర్భంగా చెప్పిన మోడీ గుజారాత్‌లో విజయం సాధిస్తే ఒక పత్రికా ప్రకటనతో సరిపెట్టేశాడు చంద్రబాబు. మీడియా ప్రశ్నలు అడుగుతుందనే ఉద్ధేశ్యంతోనే సోమవారం నాడు పోలవరం విజిట్ కూడా మానేశాడు. ఇప్పుడు మీడియా ముందుకు వచ్చి ఘనంగా పొగిడితే రేపు మళ్ళీ 2019లో బిజెపికి వ్యతిరేకంగా రంగంలోకి దిగాల్సి వస్తే పరిస్థితి ఏంటి అన్నది చంద్రబాబు రాజకీయ వ్యూహం. కాకాపోతే పైనున్న మోడీ ఇలాంటి విషయాల్లో బాబుకంటే నాలుగాకులు ఎక్కువే చదివాడు. కాబట్టి కచ్చితంగా నోటీస్ చేసే ఉంటాడు అనడంలో సందేహం లేదు. అలాగే 2014 ఎన్నికల సమయం నుంచీ నిన్న మొన్నటి వరకూ మోడీని బీభత్సంగా పొగిడిన చంద్రబాబు…….ఇప్పుడు ఎక్కడ పొగడాల్సి వస్తుందో అని తప్పించుకు తిరుగుతున్నాడంటే బిజెపితో తెగదెంపులు చేసుకోవడానికి చంద్రబాబే పావులు కదుపుతున్నాడా అని అనిపిస్తోంది. ఇప్పుడున్న సందర్భంలో మోడీని ఏ ఆంద్రప్రదేశ్ నాయకుడు పొగిడినా సీమాంధ్ర ప్రజల ఆగ్రహానికి గురికాకతప్పదు. ఆ విషయం బాబుకు కూడా అర్థమైనట్టే ఉంది. మరి ఆ స్థాయిలో అర్థం చేసుకున్న వాడు ఇంకా ఎందుకు ప్రజలను మభ్యపెడుతున్నట్టు? కేంద్రంతో పోరాటం, కేంద్రం నుంచి రాబడతాం లాంటి డైలాగులు ఎందుకు చెప్పడం? మోడీతో విడిపోయి 2014 నుంచి 2019 మధ్య కాలంలో అభివృద్ధి చేయలేకపోవడానికి మోడీనే కారణం అని చెప్పిమోడీని నిందించి 2019 ఎన్నికల గోదాలోకి దిగడానికి సిద్ధపడుతున్నాం అని డైరెక్ట్‌గా చెప్పొచ్చుగా? అయినా 2014లో బాబు చెప్పిన మాటల తర్వాత ఇక ఇప్పుడు ఏం చెప్పినా ప్రజలు నమ్మే అవకాశం ఉందంటారా?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -