Tuesday, May 14, 2024
- Advertisement -

ప్ర‌కృతితో పూరి జ‌గ‌న్నాథ్ అల‌య్‌బ‌ల‌య్‌

- Advertisement -

మాస్ సినిమాలు తీసి బాక్సాఫీస్ బ‌ద్ద‌లు కొట్టే ద‌ర్శ‌కుడు పూరీ జ‌గ‌న్నాథ్‌. త‌న విభిన్న క‌థాంశంతో యువ‌త‌ను ముంచెత్తే ఈ ద‌ర్శ‌కుడు తొలిసారిగా ఓ తొలి అంతర్జాతీయ షార్ట్‌ ఫిలింను తీసి ప్రేక్ష‌కుల‌కు వ‌దిలేశాడు. స్టోరీ లేకుండా.. న‌టీన‌టులు లేకుండా కేవ‌లం ప్రకృతి గురించి తెలుపుతూ హ‌గ్ అనే షార్ట్ ఫిలింను సోష‌ల్ మీడియాలో విడుద‌ల చేశారు.

వాయిస్ ఓవర్‌తో మూడున్నర నిమిషాల షార్ట్ ఫిలింను తీశారు. చెట్ల వల్ల కలిగే లాభాలు.. వాటిని మనం ఎందుకు కాపాడుకోవాలి అనే విషయాలను చెప్పే ప్రయత్నం చేశాడు. ప్ర‌కృతిని మ‌ర‌పురాని విధంగా తెర‌కెక్కించాడు. చివ‌ర‌లో పోస్టర్‌లో రిలీజ్ చేసిన న్యూడ్ స్టిల్‌ను చూపించాడు. క్వాలిటీ పరంగా మాత్రం హగ్ హ‌త్తుకుంటుంది. ఇసాబెల్లా అందాలు, సందీప్ చౌత నేపథ్యం సంగీతం సూప‌ర్‌గా ఉంది. ఆ అడ‌వి మ‌ధ్య‌లోకి మ‌న‌ల్ని తీసుకెళ్లేలా ఉంది. పూరి టేకింగ్ ఇలా అన్నీ కలిసి హగ్ షార్ట్ ఫిలింకు అంతర్జాతీయ స్థాయి తీసుకువచ్చాయి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -