Thursday, May 8, 2025
- Advertisement -

పవన్‌ కల్యాణ్‌తో సాయి ధరమ్ తేజ్

- Advertisement -

పవర్ స్టార్ పవన్ కల్యాణ్.. మలయాళ రిమేక్ భీమ్లా నాయక్‌తో ఈ ఏడాది బ్లాక్ బస్టర్ అందుకున్న సంగతి తెలిసిందే. తాజాగా పవన్ .. తమిళ్ రీమేక్‌లో నటించబోతున్నట్లు సమాచారం. భీమ్లానాయక్ తర్వాత క్రిష్ దర్శకత్వంలో హరిహర వీరమల్లు చేస్తున్నారు. ప్రస్తుతం ఈ మూవీ సెట్స్‌పై ఉంది. భారీ బడ్జెట్ చిత్రంగా పాన్ ఇండియా రేంజ్‌లో ఈ మూవీ తెరకెక్కుతోంది. ఈ మూవీలో నిధి అగర్వాల్, నర్గీస్ ఫక్రీ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ ఆగస్టు నాటికి షూటింగ్ మొత్తం పూర్తి కానుంది.

వాస్తవానికి హరిహరి వీరమల్లు తర్వాత హరీశ్ శంకర్‌ దర్శకత్వంలో భవదీయుడు భగత్ సింగ్ షూటింగ్ మొదలు కావాల్సి ఉంది. కానీ ఈ మధ్యలో ఓ తమిళ రీమేక్‌లో పవన్ నటించబోతున్నారు. తమిళంలో తెరకెక్కిన వినోదయ చిత్రాన్ని తెలుగులో తీయబోతున్నారు. వినోదయ చిత్రం ప్రధాన పాత్ర పోషించి.. స్వీయ దర్శకత్వంలో తెరకెక్కించారు సముద్రఖని. ఇందులో తంబిరామయ్య మరో కీలక పాత్ర పోషించారు. అయితే రీమేక్ మూవీలో పవన్‌ తో పాటు హీరో సాయిధరమ్‌ తేజ్ నటిస్తున్నట్లు తెలుస్తోంది.

పవన్ ఈ మూవీ కోసం 20 రోజు సమయం కేటాయించినట్లు సమాచారం. ఈ సినిమా చడీ చప్పుడు లేకుండా లాంచ్‌ అయినట్లు సమాచారం. వచ్చే నెలలో రెగ్యులర్ షూటింగ్ మొదలుపెట్టబోతున్నారు. ఇక పవన్ స్టార్‌ పవన్‌తో పాటు మెగా హీరో సాయి ధరమ్ తేజ్ నటిస్తుండటంతో ఈ మూవీపై అభిమానుల్లో ఆసక్తి నెలకొంది. ఈ మూవీ తర్వాతే భవదీయుడు భగత్ సింగ్ షూటింగ్ మొదలు పెడతారు.

ఇవి కూడా చదవండి

టాలీవుడ్ హీరోల కంటే వారి భార్యలే రిచ్..!

టాలీవుడ్ హీరోయిన్స్ ఎక్కడ.. ఏం చదువుకున్నారో తెలుసా ?

టాలీవుడ్ లో ఎంత మంది డాక్టర్లు ఉన్నారో చూడండి..!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -