Saturday, May 18, 2024
- Advertisement -

బాహుబలి రికార్డు బీట్ చేసిన పవన్ కళ్యాణ్

- Advertisement -

తెలుగు సినిమాలకి బాగా ఆదరణ ఒచ్చే ప్లేస్ లలో కర్ణాటక కూడా ఒకటి. తెలుగు చాలా మామూలుగా మాట్లాడేసే జనాలు కర్ణాటకలో బాగానే ఉన్నారు. మరే ముఖ్యంగా బళ్ళారి, బిదనూరు , బెంగళూర్ లాంటి సరిహద్దు కి కాస్త అటూ ఇటూ గా ఉన్న ప్రాంతాల్లో తెలుగు సినిమాల హవా బాగానే ఉంటుంది. అక్కడి మార్కెట్ ని మన తెలుగు హీరోలు బాగానే కొల్ల గొడుతూ ఉన్నారు.

 ఎస్ ఎస్ రాజమౌళి విజువల్ వండర్ బాహుబలి కర్ణాటకా లో ముప్పై ఎనిమిది కోట్లు వసూలు చేసి కన్నడ సినిమాల రికార్డులని కూడా తుడిచేసింది. అక్కడ అంత గా కలక్ట్ చేసిన బాహుబలి హక్కులు ఆరున్నర కోట్లకి కొనగా ఇప్పుడు పవన్ కళ్యాణ్ కొత్త సినిమా సర్దార్ గబ్బర్ సింగ్ హక్కులు ఎనిమిదిన్నర కోట్లకి కొనడం విశేషం. ఒక పక్క నాన్నకు ప్రేమతో ఆరు కోట్ల నలభై లక్షలకి అమ్ముడు వగా పవన్ కళ్యాణ్ మార్కెట్ విపరీతంగా పెరిగింది అంటున్నారు విశ్లేషకులు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -