- Advertisement -

తేజ్ ‘బరి’కు పవన్ ఫస్ట్ క్లాప్

- Advertisement -

మెగా హీరో వరుణ్ తేజ్ కొత్త సినిమా ప్రారంభమైంది. హైదరాబాద్‌లో ఈ ఉదయం వరుణ్ తేజ్ సినిమా ‘బరి’ పూజా కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఏపీ డిప్యూటీ సీఎం, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హాజరయ్యారు.

ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ ‘బరి’ చిత్రానికి ఫస్ట్ క్లాప్ ఇచ్చి వరుణ్ తో పాటు నిర్మాత నిహారిక కొణిదెలకు ఆశీర్వాదాలు తెలిపారు. పూజా కార్యక్రమానికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

ఈ చిత్రాన్ని ‘కమిటీ కుర్రోలు’ ఫేమ్ దర్శకుడు యదు వంశీ తెరకెక్కిస్తున్నారు. ‘బరి’ ఒక స్పోర్ట్స్ డ్రామాగా రూపొందుతోంది. ముఖ్యంగా వాలీబాల్ నేపథ్యంతో ఈ సినిమా సాగనుంది.

తన తొలి చిత్రంలాగే, ఈ ప్రాజెక్ట్ కూడా గ్రామీణ నేపథ్యంలో కథను చెప్పనుంది. ఈ సినిమాను 2027 సంక్రాంతి సందర్భంగా విడుదల చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -