మీకు తరచుగా మొటిమలు వస్తున్నాయా? క్రీములు, సీరమ్స్, జెల్స్, స్పాట్ కరెక్టర్స్ అన్ని ఉపయోగిస్తున్నప్పటికీ సమస్య తగ్గకపోతే, మీ స్కిన్‌కేర్ రొటీన్‌ను కాకుండా మీరు తినే ఆహారాన్ని ఒకసారి పరిశీలించాల్సిన సమయం వచ్చింది.
మొటిమల నియంత్రణ బయటపైనే కాదు, మన శరీరం లోపల నుంచే ప్రారంభమవుతుంది. మీరు తీసుకునే ఆహారం మీ చర్మంపై గణనీయమైన ప్రభావం చూపుతుంది.
వైద్య నిపుణుల సలహాల ప్రకారం…మీరు తినే ఆహారం శరీరంలో మార్పులు కలిగిస్తుంది. ఆ మార్పులు మొటిమల తీవ్రతను ప్రభావితం చేస్తాయి .
అంటే మొటిమలు కేవలం చర్మ సమస్య మాత్రమే కాదు—ఇది శరీరం మొత్తం ఆరోగ్యంతో సంబంధం ఉన్న విషయం. కాబట్టి నివారణ, చికిత్సలో ఆహారం కూడా కీలక పాత్ర పోషిస్తుంది.
కొన్ని ఆహారాలు ఇన్సులిన్ స్థాయిలను పెంచడం, హార్మోన్ అసమతుల్యత, ఇన్‌ఫ్లమేషన్ (వాపు) కలిగించడం ద్వారా మొటిమలకు దారితీస్తాయి. అలాంటి వాటిని తగ్గించడం మంచిది:
బిస్కెట్లు
వైట్ బ్రెడ్
అధిక చక్కెర ఉన్న ఫుడ్స్
ప్రాసెస్ చేసిన ఆహారాలు
ఈ ఆహారాలు పోషక విలువలు తక్కువగా ఉండటంతో పాటు, చర్మ సమస్యలను మరింత పెంచే అవకాశం ఉంది.మంచి చర్మం కోసం కేవలం క్రీములు సరిపోవు. మీ డైట్ కూడా అంతే ముఖ్యమైనది. ఆరోగ్యకరమైన ఆహారం తీసుకుంటేనే మొటిమలను నియంత్రించవచ్చు.
