Tuesday, May 21, 2024
- Advertisement -

ఎన్టీఆర్ నోట‌..ప‌వ‌న్ డైలాగ్‌

- Advertisement -

అర‌వింద స‌మేత హిట్‌తో మంచి జోష్‌లో ఉన్నాడు యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్.ఆ సంద‌ర్భంగా సినిమా సక్సెష్ మీట్‌ను ఏర్పాటు చేశారు చిత్ర యూనిట్‌.’అరవింద సమేత’ సక్సెస్ మీట్ లో తన స్పీచ్ లో పవన్ కళ్యాణ్ డైలాగ్ ని చెప్పడం ఇప్పుడు టాక్ ఆఫ్ ది టౌన్ అయింది.పవన్ కళ్యాణ్, త్రివిక్రమ్ కాంబినేషన్ లో వచ్చిన ‘అత్తారింటికి దారేది’ సినిమాలో క్లైమాక్స్ ఎపిసోడ్ లో పవన్ కళ్యాణ్ ‘కంటికి కనిపించని శత్రువుతో బయటకి కనబడని యుద్ధం చేస్తున్నా’ అనే డైలాగ్ చెబుతాడు.

అదే డైలాగ్ ని తన ప్రసంగంలో ఒక చోట పలికాడు ఎన్టీఆర్.అయితే ఎన్టీఆర్ పవన్ కళ్యాణ్ పేరుని కానీ సినిమా పేరుని కానీ ప్రస్తావించకుండా.. త్రివిక్రమ్ ఒక సినిమాలో రాసిన డైలాగ్ అంటూ చెప్పాడు. తనతో చేయాల్సిన సినిమాకు కథ తయారు చేసే క్రమంలో త్రివిక్రమ్ తనలో తానే యుద్ధం చేసినట్లు ఎన్టీఆర్ తెలిపాడు.

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -