Wednesday, May 15, 2024
- Advertisement -

పవన్ కళ్యాణ్ దృష్టి దాని మీద పెట్టాడు

- Advertisement -

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ దాదాపు రెండేళ్ళు ఎంతో కష్టపడి రాసిన సర్దార్ గబ్బర్ సింగ్ టాలీవుడ్ బిగ్గెస్ట్ డిసాస్టర్స్ లో ఒకటిగా నిలిచిన విషయం అందరికీ తెలిసిందే. అసలు తప్పు ఎక్కడ జరిగింది అనేది పక్కకు పెడితే ఇలాంటి నాసిరకం స్టోరీతో కూడా పవన్ కళ్యాణ్ బాక్స్ ఆఫీస్ దగ్గర 52 కోట్లకు పైగా షేర్ కలెక్ట్ చేయడం నిజంగానే గొప్ప విషయం అని చెప్పాలి.

సినిమాలో ప్రేక్షకులను ఆకట్టుకున్న విషయాలు ఏమైనా ఉన్నాయి అంటే పవన్ కళ్యాణ్ డిసైన్ చేసిన ఫైట్ సీన్స్ అని చెప్పొచ్చు. ఇంటర్వెల్ ఫైట్ ఓ రేంజ్ లో ప్రేక్షకులను అలరించింది. ఈ సినిమాలు చాలా విభాగాల్లో భాగం అయిన పవన్ ఆ ఒక్క విభాగంలోనే మంచి మార్కులు దక్కించుకున్నాడు.

ఇప్పుడు తన అప్ కమింగ్ మూవీలో మిగిలిన విషయాలు అన్నీ దర్శకుడికే వదిలేసి సినిమాలో కేవలం ఫైట్ సీన్స్ మాత్రం తనకు నచ్చినట్లు చేయాలని పవన్ అనుకుంటున్నట్లు చెబుతున్నారు. దాంతో ఈసారి గబ్బర్ సింగ్ ని మించిన ఫైట్ సీన్స్ ఇందులో పెట్టబోతున్నాడట దర్శకుడు ఎస్.జే.సూర్య. ఈ సినిమాను అతిత్వరలో మొదలుపెట్టడానికి సన్నాహాలు చేస్తున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -