Sunday, May 19, 2024
- Advertisement -

గాయకుడు అర్జిత్ సింగ్ వేడుకోలు

- Advertisement -

కండలవీరుడు సల్మాన్ ఖాన్. బాలీవుడ్ లో తిరుగులేని కథానాయకుడు. అంతే కాదు. ఎప్పుడూ ఓ వివాదంలోనే ఉంటారు. తాజాగా బాలీవుడ్ గాయకుడు అర్జిత్ సింగ్ పై కినుకతో ఉన్నాడు కండల వీరుడు. దీంతో తనను క్షమించాలని అర్జిత్ సింగ్ ట్వట్టర్ లో ఏకంగా ఓ లేఖనే రాసేశాడు. ఇంతకీ విషయం ఏమిటంటే ఇటీవల జరిగిన ఓ కార్యక్రమంలో అర్జిత్ సింగ్ సల్మాన్ ఖాన్ ను అవమానించారనే వదంతులు వచ్చాయి.

దాంతో కోపం వచ్చిన సల్మాన్ ఖాన్ తన కొత్త చిత్రంలో అర్జిత్ సింగ్ పాడిన పాటను తొలగించి వేరొకరితో వేరే స్టైల్లో పాడిస్తున్నారని తెలిసింది. దీంతో తీవ్ర మనస్థాపం చెందిన అర్జిత్ సింగ్ తనను క్షమించాలని, తాను ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదని సల్మాన్ కు ఫోన్ ద్వారా, ఎస్ ఎం ఎస్ ద్వారా చాలాసార్లు విన్నవించుకునేందుకు ప్రయత్నించాడట. అయితే సల్మాన్ ఖాన్ మాత్రం అతనికి దొరకలేదు. దీంతో చేసిది లేక ట్విట్టర్ లో తన బాధను, క్షమాపణలతో కూడిన లేఖను పోస్ట్ చేశాడు అర్జిత్ సింగ్.

ఆ లేఖలో సల్మాన్ జీ నేను మిమ్మల్నీ అవమానించలేదు. నిజానికి నాకు, నా కుటుంబానికి మీరంటే ఎంతో ఇష్టం. ఎంతో గౌరవం. బహిరంగంగా మీకు క్షమాపణలు చెప్పుకుంటున్నాను. మీ కోసం నేను పాడిన పాటను తొలగించకండి. కనీసం ఆ వెర్షన్ అయినా ఉంచండి అని ప్రాధేయ పడ్డాడు. నేను ఇప్పటికి.. ఎప్పటికి మీ అభిమానినే. అంటూ గాయకుడు అర్జిత్ సింగ్ తన లేఖను ముగించాడు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -