Sunday, May 5, 2024
- Advertisement -

మెగా అభిమానులు బాధపడిపోతున్నారు!

- Advertisement -

చిరంజీవి రీఎంట్రీ సినిమా పూజా కార్యక్రమం అత్యంత ఘనంగా జరిగింది. ప్రముఖ రచయిత పరుచూరి వెంకటేశ్వరరావు క్లాప్ కొట్టగా…ఈ వేడుకకి మెగా ఫ్యామిలీ సభ్యులంతా పాల్గొన్నారు.

మెగా అభిమానులు చిరంజీవి రీఎంట్రీతో ఎంతో సంతోషంగా ఉన్నారు. కానీ, మెగా అభిమానులతో పాటు మెగా ఫ్యామిలీ సన్నిహితులను కూడా బాధపెట్టిన అంశం ఒక్కటే. ఈ వేడుకకి చిరంజీవి తమ్ముడు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హాజరు కాకపోవడం.

చిరంజీవి, నాగబాబు, రామ్ చరణ్, అల్లు అర్జున్ , వరుణ్ తేజ్, సాయి ధరమ్ తేజ్, అల్లు శిరీష్, చిరంజీవి ఇద్దరు కుమార్తెలు మరియు అల్లుళ్ళు, మనువాళ్ళు, మనువరాళ్ళు అంతా హాజరైన ఈ పూజ కార్యక్రమానికి పవన్ కళ్యాణ్ కూడా వచ్చుంటే….ఆ గ్రూప్ ఫోటోలో పవన్ కళ్యాణ్ కుటుంబం కూడా కనిపించి ఉంటె ఇంకెంత బాగుండేదో! అని మెగా అభిమానులు బాధపడిపోతున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -