Tuesday, May 7, 2024
- Advertisement -

కొణిదెల ప్రొడక్షన్‌ కంపెనీ.. చిరంజీవి 150వ సినిమా

- Advertisement -

తన తల్లి సురేఖ కొణిదెలతో కలిసి మెగాపవర్‌ స్టార్‌ రాంచరణ్‌ తమ కొత్త ఆఫీస్‌ లో “ది కొణిదెల ప్రొడక్షన్‌ కంపెనీ” పేరుమీద తమ ఇన్‌ హౌస్‌ బ్రాండ్‌ ను ప్రారంభించారు. అందరూ ఆతృతగా ఎదురుచూస్తున్న మెగాస్టార్‌ చిరంజీవి 150వ సినిమా వీరి ఫస్ట్‌ వెంచర్‌. ఈ సినిమాకు వివి వినాయక్‌ దర్శకుడు.

ఇప్పటికే  సెట్స్‌ పైకి వెళ్ళిన ఈ సినిమా తమిళంలో ఘనవిజయం సాధించిన “కత్తి” సినిమాకు రీమేక్‌. నాగబాబు గౌరవ దర్శకత్వం వహించిన తొలిషాట్‌ కు అల్లు అరవింద్‌ కెమెరా స్విచ్చాన్‌ చేసి షూటింగ్‌ ను ప్రారంభించారు. తొలిషాట్‌ కు పరుచూరి వెంకటేశ్వర రావు గారు క్లాప్‌ కొట్టారు.

ఈ సినిమాకు టాలీవుడ్‌ రాక్‌ స్టార్‌ దేవిశ్రీ ప్రసాద్‌ సంగీతం మరియు ప్రముఖ సినిమాటోగ్రాఫర్‌ రత్నవేలు చాయాగ్రహణం అందిస్తున్నారు. 2017 సంక్రాంతి కానుకగా ఈ సినిమాను ప్రేక్షకులకు అందించే దిశగా సన్నాహాలు జరుగుతున్నాయి.

కొణిదెల ప్రొడక్షన్‌ కంపెనీ ఆఫీస్‌ లో ప్రైవేట్‌ ఫంక్షన్‌ గా జరిగిన ఈ కార్యక్రమంలో పరిశ్రమ ప్రముఖులు అల్లు అర్జున్‌, వరుణ్‌ తేజ్‌, సాయిధరం తేజ్‌, నాగ బాబు, అల్లు అరవింద్‌, కొరటాల శివ, శరత్‌ మరార్‌, జెమిని కిరణ్‌, డివివి దానయ్య, తిరుపతి ప్రసాద్‌, పరుచూరి వెంకటేశ్వరరావు మరియు కుటుంబసభ్యులు పాల్గొన్నారు.

సంప్రదాయబద్ధంగా జరిగిన ఈ కార్యక్రమంలో కేవలం కుటుంబసభ్యులు మరియు దగ్గరి స్నేహితులు మాత్రమే పాల్గొన్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -