పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇకపై కూడా సినిమాలు చేస్తాడా? చెయ్యడా? అన్న చర్చకు ఫుల్ స్టాప్ పడింది. ఇకపై సినిమాలు చేయనని పవన్ కళ్యాణ్ ఎప్పుడూ తేల్చి చెప్పింది లేదు. కాకపోతే ఆసక్తిలేదు…. చెయ్యనేమో అంటూ కొన్ని మాటలు అయితే చెప్పాడు. ఇప్పుడు ఆ మాటలను కూడా పక్కనపెట్టి సినిమా చెయ్యడానికి రెడీ అయిపోయాడు పవన్. అయితే ఇప్పుడు చెయ్యబోయే సినిమాతో ఇమేజ్ మారిపోవాలని కోరుకుంటున్నాడు. ఇప్పటి వరకూ ఒకటి రెండు సినిమాల విషయం పక్కనపెడితే పవన్ చేసిన ఎక్కువ క్యారెక్టర్స్ సిల్లీగానే ఉంటాయి. కామెడీ సీన్స్‌లోనే పవన్ యాక్టింగ్ ఎక్కువగా గుర్తుండిపోయే పరిస్తితి. సెటైరికల్, ఎటకారం సీన్స్ బాగా పండిస్తాడు. కామెడీ టైమింగ్ బాగుంటుంది లాంటి ఇమేజ్ మాత్రమే పవన్‌కి ఎక్కువగా ఉంది.
అందుకే 2019 ఎన్నికల్లో సీరియస్‌గా ఎన్నికల్లో పోటీ చేయనున్న నేపథ్యంలో ఇమేజ్ మార్పుకోసం పవన్ ప్లాన్ చేస్తున్నాడు. భారతీయుడు, ఒకే ఒక్కడు, జెంటిల్ మేన్, ఠాగూర్ తరహా సినిమాలో కనిపించాలనుకుంటున్నాడు. అందుకే ఆ తరహా కథ ఉంటే చెప్పమని తమిళ్ టాప్ డైరెక్టర్‌ని మురుగదాస్‌ని అడిగాడు పవన్. మురుగదాస్‌తో చర్చలు జరిపాడు. సంతోష్ శ్రీనివాస్ చేసిన రొటీన్ కథలో కనిపించడం పవన్‌కి ఇష్టం లేదట. అందుకే మురుగదాస్ దర్శకత్వంలో భారీ సీరియస్ ఫిల్మ్‌లో నటించాలని కోరుకుంటున్నాడు పవన్. ఠాగూర్ సినిమా ఒరిజినల్‌తో పాటు, స్టాలిన్, కత్తి, తుపాకి లాంటి సినిమాల్లో సీరియస్ ఇమేజ్‌ని ఆకట్టుకునేలా ఇచ్చాడు మురుగా. పవన్ -మురుగదాస్ కాంబినేషన్‌లో రాబోయే సినిమాలో ఈ సారి ఎలాంటి సరికొత్త మెస్సేజ్‌తో వస్తాడో? పవన్ కళ్యాణ్ ఇమేజ్ మారిపోయే స్థాయి క్యారెక్టర్‌లో పవన్‌ని ఎలా చూపిస్తాడో చూడాలి మరి.