Thursday, April 18, 2024
- Advertisement -

మురుగదాస్ – కమల్ కాంబినేషన్ లో సినిమా..!

- Advertisement -

తమిళ అగ్ర కథానాయకుడు కమల్ హాసన్ లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో విక్రమ్ అనే సినిమా చేస్తున్నాడు. కరోనా కారణంగా ఈ సినిమా షూటింగ్ కి బ్రేక్ పడింది. ప్రస్తుతం కరోనా ప్రభావం మెల్లమెల్లగా తగ్గుతుండటంతో త్వరలోనే ఈ సినిమా మళ్లీ సెట్స్ పైకి వెళ్లే అవకాశం ఉంది. ఈ సినిమాకంటే ముందే కమలహాసన్, శంకర్ దర్శకత్వంలో ఇండియన్ -2 సినిమాను ప్రారంభించాడు. అయితే ఆ సినిమాని నిర్మిస్తున్న లైకా ప్రొడక్షన్స్, దర్శకుడు శంకర్ మధ్య తలెత్తిన వివాదంతో షూటింగ్ నిలిచి పోయింది.

ఈ వివాదంపై ప్రస్తుతం కోర్టులో విచారణ జరుగుతోంది. కాగా ఈ సినిమా షూటింగ్ నిలిచిపోవడంతో కమలహాసన్ లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో విక్రమ్ అనే సినిమాను ప్రారంభించాడు. ఈ సినిమా షూటింగ్ ముగిసిన తర్వాత ప్రముఖ దర్శకుడు మురుగదాస్ తో కలసి కమల్ ఓ సినిమా చేయనున్నట్లు వార్తలు వస్తున్నాయి.

Also Read: విలక్షణ దర్శకుడు, విలక్షణ హీరో కాంబినేషన్ లో పాన్ ఇండియా మూవీ..!

ప్రస్తుతం మురుగదాస్ తెలుగు హీరో అల్లు అర్జున్ తో ఓ సినిమా చేసేందుకు ప్రయత్నాలు సాగిస్తున్నాడు. అయితే ఈ సినిమా ఇంకా కన్ఫర్మ్ కాలేదు. కాగా గతంలో మురుగదాస్ కోలీవుడ్ హీరో విజయ్ తో తుపాకీ అనే సినిమా చేసిన సంగతి తెలిసిందే. ఈ సినిమా సీక్వెల్ కోసం మురుగదాస్ ఓ కథ రెడీ చేశాడు. అయితే విజయ్ పలు సినిమాలతో బిజీగా ఉండడంతో ఇదే కథను కొంచెం మార్చి కమల్ హాసన్ తో తీయాలని మురుగదాస్ ప్రయత్నిస్తున్నాడట. కమల్ – మురుగదాస్ కాంబినేషన్ కు సంబంధించి అఫీషియల్ అనౌన్స్ మెంట్ రావాల్సి ఉంది.

Also Read: ఇద్దరు పెద్ద హీరోలతో శ్రీనువైట్ల మల్టీ స్టారర్​..!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -