Thursday, May 23, 2024
- Advertisement -

సర్దార్ కలక్షన్ ల సునామీ

- Advertisement -

‘సర్దార్ గబ్బర్ సింగ్’ సినిమా విడుదలైన ప్రతి ఏరియాలోను విజయవిహారం చేస్తోంది. ఆశించిన స్థాయిలో అంచనాలను అందుకుంటూ తొలిరోజునే భారీ వసూళ్లను సాధించింది.

నైజామ్ లో 4.25 కోట్లు .. సీడెడ్ లో 4.24 కోట్లు .. నెల్లూరులో 86 లక్షలు .. కృష్ణాలో 1.51కోట్లు .. గుంటూరులో 2.47 కోట్లు .. వైజాగ్ లో 2.2 కోట్లు .. తూర్పు గోదావరిలో 2.27 కోట్లు .. పశ్చిమ గోదావరిలో 2.7 కోట్లు వసూలు చేసింది.  ఇలా ఈ సినిమా తెలుగు రాష్ట్రాల్లో తొలిరోజునే 20.5 కోట్లను రాబట్టింది. పవన్ కల్యాణ్ కి గల క్రేజ్ కారణంగా .. గతంలో వచ్చిన ‘గబ్బర్ సింగ్’ ఘన విజయాన్ని సాధించడం వలన, ఈ సినిమాపై భారీ అంచనాలు వున్నాయి. అందువలన తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా మొదటి రోజున ఈ మొత్తాన్ని రాబడుతుందని భావించారు. అనుకున్నట్టుగానే ఈ సినిమా రికార్డు స్థాయిలో వసూలు చేసింది. మరో వైపున అమెరికాలో మొదటి రోజు ప్రీమియర్ షోల వసూళ్ల విషయంలో, ఈ సినిమా ‘శ్రీమంతుడు’ రికార్డును అధిగమించిందని చెబుతున్నారు. 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -