Monday, May 20, 2024
- Advertisement -

హ్రితిక్ రోషన్ కోసం పాట పాడబోతున్న ఎన్టీఆర్ ?

- Advertisement -

మాస్ ఆడియన్స్ ను అలరించడంలో మంచి మార్కులు కొట్టేసిన ఎన్టీఆర్, మంచి సింగర్ అనే విషయం కూడా తెలిసిందే. ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చిన ‘నాన్నకు ప్రేమతో’ సినిమాలోను ఒక పాటతో ఆయన అదరగొట్టేశాడు. ఆ మధ్య కన్నడ సూపర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ కోసం ఎన్టీఆర్ పాడిన పాటకి అక్కడ మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇక ఇప్పుడు ఆయన బాలీవుడ్ కి తన స్వరాన్ని వినిపించడానికి రెడీ అవుతున్నాడు.

ఎన్టీఆర్ తో ఈ ప్రయత్నం చేయిస్తున్నది ఎవరో కాదు .. బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్. ఈ బాలీవుడ్ హీరో ఎన్టీఆర్ ను ఎంతగానో అభిమానిస్తుంటాడు .. ఆయన డాన్స్ ను అభినందిస్తుంటాడు. ఎన్టీఆర్ మంచి సింగర్ అనే విషయం కూడా ఆయనకి బాగా తెలుసు. అందువలన తనకి సంబంధించిన ఒక పాప్ ఆల్బమ్ లో ఎన్టీఆర్ తో ఒక పాట పాడించాలని ఆయన ఉత్సాహాన్ని చూపుతున్నాడట. ఈ విషయంపై ఎన్టీఆర్ తో మాట్లాడటం .. ఆయన ఓకే చెప్పడం కూడా జరిగిపోయాయని అంటున్నారు. విశాల్ – శేఖర్ సంగీత దర్శకత్వంలో ఈ పాప్ ఆల్బమ్ రూపొందబోతోంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -