ఇప్పటికే పలు బాలీవుడ్ సినిమాలను రీమేక్ చేశాడు పవర్ స్టార్. హిందీలో హిట్ అయిన ‘అవ్ ఆజ్ కల్’ సినిమాను ‘తీన్ మార్’ పేరుతో… ఆ తర్వాత ‘దబాంగ్’ ను ‘గబ్బర్ సింగ్ ‘ పేరుతో రీమేక్ చేసిన నేపథ్యం ఉన్న పవన్ ఇప్పుడు మరో రీమేక్ కు సిద్ధం అయినట్టుగా తెలుస్తోంది.
ఈ సారి పవన్ ‘భజరంగీ భాయ్ జాన్’ సినిమా మీద దృష్టి సారించినట్టుగా తెలుస్తోంది. ప్రస్తుతం బాలీవుడ్ రికార్డులను షేక్ చేస్తున్న ఈ సినిమాను తెలుగులో రీమేక్ చేసే ఆసక్తితో ఉన్నాడట పవన్.
ఈ సినిమా బాలీవుడ్ లో వందల కోట్ల రూపాయలను ఇట్టే అధిగమించేస్తోంది.. కథ పరంగా కూడా ప్రశంసలు అందుకొంటోంది. దీంతో రీమేక్ పట్ల పవన్ ఆసక్తితో ఉన్నాడట. సల్మాన్ ఖాన్ సినిమాలను రీమేక్ చేయడం పవన్ కు అచ్చొచ్చింది కూడా., ఇంతకు ముందు ఇదే హీరో బాలీవుడ్ లో రూపొందించిన ‘దబాంగ్ ‘ పవన్ తన ప్లాఫులకు పుల్ స్టాప్ పెట్టి విజయాన్ని సొంతం చేసుకొన్నాడు. ఇక భజరంగీతో కూడా అలాంటి ఫీటే సాధ్యం అవుతుందని లెక్కలేసుకొంటున్నాడు.
ఈ సినిమాకు కథను అందించిన వారిలో తెలుగు వ్యక్తి విజయేంద్ర ప్రసాద్ కూడా ఉన్నాడు. ఈ నేపథ్యంలో ఈ సినిమా కథ ను తెలుగు వారికి అనువుగా తీర్చిదిద్దడంకూడా సులభమే. కాబట్టి ఈ సినిమా పట్టాలెక్కే అవకావాలున్నాయని అనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. మరి ప్రస్తుతానికి పవన్ ‘సర్దార్’ తో బిజీగా ఉన్నాడు. అది అయిపోయిన తర్వాతే ఈ రీమేక్ పై దృష్టి సారించే అవకాశాలున్నాయి.
