Saturday, May 18, 2024
- Advertisement -

జగన్ మాట.. జేసీ మాట ఒక్కటే..!

- Advertisement -

పట్టిసీమతో రాయలసీమకు నీళ్లు రావు… అని ఇప్పటికే ఏపీ ప్రతిపక్ష నేత జగన్ మోహన్ రెడ్డి పలు మార్లు వ్యాఖ్యానించాడు. ప్రభుత్వం పట్టిసీమ ప్రాజెక్టును చేపట్టడం దండగా అని వాదిస్తున్న వైఎస్సార్ కాంగ్రెస్ తరపు నుంచి జగన్ మాట్లాడుతూ..

ఈ ప్రాజెక్టుతో సీమకు ఎలాంటి ఉపయోగం లేదని స్పష్టం చేశాడు. అయితే తెలుగుదేశం నేతలు మాత్రం ఈ వాదనను ఒప్పుకోలేదు. సీమకు నీళ్లు ఇవ్వడం జగన్ కు ఇష్టం లేదు అందుకే ఆయన అలా మాట్లాడుతున్నాడు అని  తెలుగుదేశం వాళ్లు జగన్ పై ఎదురుదాడి చేసేవాళ్లు.

అయితే ఇప్పుడు తాజాగా తెలుగుదేశం నేతే ఒకరు స్పందించారు. పట్టిసీమతో రాయలసీమకు ఎలాంటి ప్రయోజనం లేదని ఆయన తేల్చేశాడు. ఇలా స్పందించింది మరెవరో కాదు జేసీ దివాకర్ రెడ్డి. అనంతపురం ఎంపీ అయిన దివాకర్ రెడ్డి మాట్లాడుతూ పట్టిసీమ వల్ల ఉపయోగం లేదని స్పష్టం చేశాడు. దీని వల్ల రాయలసీమకు నీళ్లు వస్తాయని అనుకోవడం భ్రమేనని ఆయన స్పష్టం చేశాడు. మరి జగన్ ఈ ప్రాజెక్టుతో ప్రయోజనం లేదని అంటే.. తెలుగుదేశం వారు ఎదురుదాడి చేశారు. ఇప్పుడు జేసీ కూడా అదే మాటే చెబుతున్నాడు.

అసలు ప్రభుత్వ గెజిట్ లో కూడా పట్టిసీమతో సీమకు నీళ్లు అందిస్తామని ఎక్కడా పేర్కొనలేదు. ఈ ప్రాజెక్టు విషయంలో విమర్శలు వచ్చేసరికి.. దీని ద్వారా భారీ ఎత్తున అవినీతికి తెరలేపారనే ప్రచారం వచ్చే సరికి తెలుగుదేశం వారు ఎదురుదాడిలో భాగంగా రాయలసీమకు నీళ్లు అంటూ వాదించడం మొదలుపెట్టారు. ఇప్పుడు దివాకర్ రెడ్డి మాటలతో పట్టిసీమతో రాయలసీమకు నీళ్లు అనేది బూటకపు మాటే అని స్పష్టం అవుతోంది. మరి దీనిపై తెలుగుదేశం వాళ్లు ఏమంటారో!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -