Friday, April 26, 2024
- Advertisement -

పవన్ ‘వకీల్ సాబ్’ ట్రైలర్ అదుర్స్!

- Advertisement -

పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ‘వకీల్ సాబ్’ థియేట్రికల్ ట్రైలర్ రిలీజ్ అయ్యింది. బాలీవుడ్ లో అమితాబ్ నటించిన ‘పింక్’ రిమేక్ గా వస్తున్న ఈ చిత్రంలో పవన్ తన విశ్వరూపాన్ని చూపించట్లు తెలుస్తుంది. ఒరిజినల్‌లో ఉన్న థీమ్ మాత్రమే తీసుకుని పవన్ కళ్యాణ్ ఇమేజ్‌కు సరిపోయేలా కథలో చాలా మార్పులు చేసాడు వేణు శ్రీరామ్. దాదాపు మూడేళ్ల తర్వాత పవన్ తెరపై కనిపించనుండడంతో ఫ్యాన్స్ ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి.

సోమవారం సాయంత్రం రెండు తెలుగు రాష్ట్రాల్లో ‘వకీల్ సాబ్’ ట్రైలర్‌ను థియేటర్స్‌లో ప్రదర్శించారు. ఈ సినిమా ఏప్రిల్ 9న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఒరిజినల్ వెర్షన్‌లో లేని చాలా అంశాలను ఇందులో చూపించబోతున్నారు దర్శక నిర్మాతలు. మరోవైపు యాక్షన్ సీక్వెన్సుల విషయంలో కూడా చాలా జాగ్రత్తలు తీసుకున్నాడు వేణు శ్రీరామ్.

దాంతో పాటు హీరోయిన్, పాటలు కూడా ఉండబోతున్నాయి. శ్రీరామ్ వేణు దర్శకత్వం వహించగా, బోనీ కపూర్ సమర్పణలో దిల్ రాజు – శిరీష్ నిర్మించిన ఈ చిత్రంలో శృతి హాసన్ కథానాయిక కాగా నివేదా థామ‌స్‌, అంజ‌లి, అన‌న్య నాగ‌ళ్ల కీలకపాత్రల్లో న‌టిస్తున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -