Saturday, April 27, 2024
- Advertisement -

సాగర్ ఉప ఎన్నిక: బీజేపీ అభ్యర్థి ఆయనే..

- Advertisement -

ఇటీవ‌ల ప‌ట్ట‌భ‌ద్రుల ఎమ్మెల్సీ ఎన్నిక‌లు రాజ‌కీయంగా తెలంగాణాలో కాకా పుట్టించాయి. మ‌ళ్లీ ఇప్పుడు రాష్ట్ర రాజ‌కీయాల‌న్ని నాగార్జున సాగ‌ర్ అసెంబ్లీ ఉప ఎన్నిక‌కు మ‌ళ్లాయి. రాష్ట్రంలో ప్ర‌ధాన పార్టీల‌న్నీ ఎలాగైనా నాగార్జున సాగ‌ర్ స్థానాన్ని నిల‌బెట్టుకోవాల‌ని గ‌ట్టిగానే ప్ర‌య‌త్నిస్తున్నాయి. ఈ క్ర‌మంలోనే అభ్య‌ర్థుల‌ను ప్ర‌క‌టించి ప్రచారంలో దూసుకుపోతున్నాయి.

ఇక రాష్ట్రంలో త‌న ప్రాబ‌ల్యాన్ని మ‌రింత పెంచుకోవాల‌నుకుంటోంది బీజేపీ. నాగార్జున సాగ‌ర్ స్థానాన్ని కైవ‌సం చేసుకుని అధికార టీఆర్ ఎస్‌ను కు ప్ర‌త్యామ్నాయం తామేన‌ని నిరూపించుకోవాల‌నుకుంటోంది. దీని కోసం సాగ‌ర్ ఉప ఎన్నిక బ‌రిలో నిలిపే అభ్య‌ర్థిపై భారీ స్థాయిలో క‌స‌ర‌స్తులు చేసింది. తాజాగా సాగ‌ర్ బ‌రిలో త‌మ అభ్య‌ర్థిగా డాక్ట‌ర్ పానుగోతు ర‌వికుమార్‌ను నిల‌పుతున్నామ‌ని ప్ర‌క‌టించింది.

ఇదిలా ఉండ‌గా, అధికార టీఆర్ఎస్ నుంచి నోముల భ‌గ‌త్ బ‌రిలో నిలిచారు. ఇక కాంగ్రెస్ పార్టీ నుంచి మాజీ మంత్రి, సీనియ‌ర్ నేత జానారెడ్డి పోటీ చేస్తున్నారు. కాగా, టీఆర్ ఎస్ నేత సిట్టింగ్ ఎమ్మెల్యే నోముల న‌ర్సింహ‌య్య హ‌ఠాన్మ‌ర‌ణంతో నాగార్జునా సాగ‌ర్ నియోజ‌క‌వ‌ర్గానికి ఉప ఎన్నిక నిర్వ‌హిస్తున్నారు. అధికార టీఆర్ ఎస్ సిట్టింగ్ స్థానం కావ‌డంతో గెలుపుపై ఆ పార్టీ ధీమాగా ఉంది. అలాగే, ఇక్క‌డ విజ‌యం సాధించి పార్టీకి పూర్వ‌వైభ‌వం తీసుకువ‌చ్చే దిశ‌గా ముందుకు సాగాల‌ని హ‌స్తం నేత‌లు భావిస్తున్నారు.

రంగుల కేళీ.. సంబురాల హోలీ !

అభినవ ఉసేన్ బోల్ట్‌.. కంబ‌ళ వీరుడి స‌రికొత్త రికార్డు !

మ‌ణిశ‌ర్మ బీటూ.. చిరు స్టెప్పూ !

మళ్లీ లాక్‌డౌన్ అవ‌స‌రముండదు: ఏపీ హోం మంత్రి

తెలంగాణలో ‘బ‌హిరంగ’ ఆంక్ష‌లు

BJP finalised Dr Ravi Kumar as their contestant in Nagarjunasagar by polls

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -