Saturday, May 4, 2024
- Advertisement -

రేణు వద్దన్నా.. పవనే కావాలని విడాకులు తీసుకున్నాడా..?

- Advertisement -

రేణూదేశాయ్ కి పవన్ కళ్యాణ్ విడాకులు ఇచ్చి తీన్మార్ సినిమాలో నటించిన అన్నా లెజ్‌నేవాని పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. ఐతే పవన్, రేణూదేశాయ్ ఎందుకు విడిపోయారో చాలా మందికి తెలియదు. రీసెంట్‌గా ఓ ప్రముఖ టివి ఛానెల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ విషయంపై రేణూదేశాయ్ స్పందించారు.

‘విడాకులు తీసుకోవడానికి కారణం ఏమిటి..? అనేది వంద డాలర్ల ప్రశ్నగా మిగిలిపోయింది. సమయం వచ్చినప్పుడు ఏదో ఒకరోజు చెప్తా.. అప్పటివరకు నాలోనే ఆ నిజాన్ని ఉంచుకుంటాను. తన జీవిత చరిత్ర పుస్తకంలో పవన్‌తో విడాకులకు కారణాలేమిటి..? అనేవి వివరిస్తాను. ఇప్పుడే ఇవన్నీ చెప్పి అనవసరమైన తలనొప్పులు తెచ్చుకోవడం ఇష్టం లేదు.. అందుకే మౌనంగా ఉన్నాను. అయినా విడాకుల గురించి ఎన్నేళ్లు బాధపడాలి.. జరిగిందేదో జరిగిపోయింది. దాని గురించి ఆలోచిస్తూ కూర్చుంటే కుదరదదు. నా ఖర్మ అలా రాసిపెట్టి ఉంటుంది’ అని రేణూ దేశాయ్ చెప్పుకొచ్చింది.

ఇదే సమయంలో ఆమె మరో షాకింగ్ విషయాన్ని కూడా వెల్లడించారు. విడాకులు వద్దని చాలా అడిగాను.. కానీ అందుకు పవన్ ఒప్పుకోలేదు. దాంతో నా ప్రయత్నం ఆపేశానని తెలిపింది. దాంతో మేము విడాకులు తీసుకున్నాం అని రేణు తెలిపింది. దీని బట్టి చూస్తే.. పవనే కావాలని విడాకులు తీసుకున్నట్లు అర్ధం అవుతుంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -