Saturday, May 18, 2024
- Advertisement -

నాకు ఇష్ట‌ముండె వాటికి మాత్ర‌మే బ్రాండ్ అంబాసిడ‌ర్‌గా ఉంటా.. విరాట్ కోహ్లీ

- Advertisement -

ప్ర‌ముఖ జాతీయ‌, అంత‌ర్జాతీయ కంపెనీల‌కు టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ బ్రాండ్ అంబాసిడ‌ర్‌గా ఉన్నాడు. అదాయంలో స‌చిన్ టెండూల్‌క‌ర్‌ను మించిపోయాడు. మీరు ఎలాంటి వాటికి బ్రాండ్ అంబాసిడ‌ర్‌గా ఉంటార‌నె ప్ర‌శ్న‌కు విరాట్ స్పందించారు.

తాను వాడే, తనకు నచ్చిన వాటికి మాత్రమే అంబాసిడర్‌గా ఉంటానని భారత కెప్టెన్ విరాట్ కోహ్లి మరోసారి స్పష్టం చేశాడు. ‘కొన్ని ఉత్పత్తులను నేను వాడటం లేదు. కేవలం డబ్బులు తీసుకుంటున్నాను కాబట్టి అలాంటి వాటిని ప్రమోట్‌ చేస్తూ వాడమని అభిమానులకు చెప్పలేన‌న్నాడు. నేను వాడని, నాకు నమ్మకం లేని వాటికి అంబాసిడర్ గా చేయలేను’అని కోహ్లి వ్యాఖ్యానించాడు.

ఈ ఏడాది జూన్ లో పెప్సీ కూల్ డ్రింక్ బ్రాండ్ అంబాసిడర్ గా తప్పుకున్న కోహ్లి.. ఆ సంస్థతో ఉన్న ఆరేళ్ల అనుబంధానికి కోహ్లి ముగింపు ఇచ్చాడు. ప్రధానంగా ఫిట్ నెస్ ను కాపాడుకునే క్రమంలో సాఫ్ట్ డ్రింక్స్ కు కోహ్లి దూరంగా ఉండాలని భావించాడు. ఆ క్రమంలోనే పెప్పీతో తనకున్న బంధానికి కోహ్లి ఫుల్ స్టాప్ పెట్టాడు.

ప్రస్తుతం కోహ్లి 17 ఉత్పత్తులకు బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరిస్తున్నాడు. ఇందులో ఆడి, పూమా, ఎంఆర్ఎఫ్, టిస్సోట్, బూస్ట్, కోల్గేట్, విక్స్ తదితర వాటికి కోహ్లి అంబాసిడర్ గా వ్యవహరిస్తున్నాడు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -